Trisha : తెలుగు తెరపై 40 ఏళ్లు వచ్చినా తన అందాన్ని పెంచుకుంటు పోతుంది త్రిష. తాజాగా ఈమె తన 41వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఇన్నాళ్లూ పెళ్లి చేసుకోలేదు కానీ సినిమాలో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. కానీ ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించింది, కానీ ఒక సినిమా కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చాలా రోజులు అక్కడ చికిత్స పొందింది. మరి ఈ సినిమా ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో సందడి చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈ చిత్రానికి ముందు తమిళంలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ వర్షం సినిమా మాత్రం త్రిషకు చాలా గొప్ప పేరు తెచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్లలో త్రిష అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇంత పేరు తెచ్చిపెట్టిన ఈ చిత్రం త్రిషని హాస్పిటల్ లో చేర్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ వర్షంలో తడిసిపోయే సన్నివేశాలు ఎక్కువగా చేయాలి.
ఇలా త్రిష తడి సన్నివేశాలను చిత్రీకరించడానికి దాదాపు 20 రోజులు పట్టింది. ఇక త్రిష 20 రోజుల పాటు వర్షంలో తడిసిపోవడంతో ఆమెకు జ్వరం, జలుబు వచ్చి చాలా రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఇలా తన హార్డ్ వర్క్ ద్వారా ఆమె ఒక హిట్ చిత్రం రూపంలో భారీ అదృష్టాన్ని సంపాదించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో త్రిష స్టార్ అయిపోయింది. ఇటీవల త్రిష పోనియెన్ సెల్వం, లియో సినిమాలో నటించి అందరిని మెప్పించింది. ఈ రెండు సినిమాలు బారి విజయాన్నిసాధించాయి.