Uday Kiran Sushmita Marriage: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతమంది హీరోలు అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ దక్కించుకొని యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అలాంటి హీరోలలో ఒకడు ఉదయ్ కిరణ్. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘చిత్రం’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి పరిచయమైనా ఉదయ్ కిరణ్, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వరుసగా అవకాశాలువికచాయి. నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తగిలాయి.
చూస్తూ ఉండగానే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లిన ఉదయ్ కిరణ్(Uday Kiran Sushmita Marriage) ఆ తర్వాత సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోవడం లో వైఫల్యం చెందడం వల్ల ఎంత ఎత్తుకి ఎదిగాడో, అంతే ఫాస్ట్ గా క్రిందకి పడిపోయాడు. నిన్న మొన్నటి వరకు తన చుట్టూ తిరిగిన టాప్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలు ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ ని పట్టించుకోవడం మానేశారు. ఆరోజుల్లో చిరంజీవి కూతురు సుస్మిత తో ఉదయ్ కిరణ్ పెళ్లి ఫిక్స్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా జరిపించారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఉదయ్ కిరణ్ తో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది, దీని గురించి సోషల్ మిడియా లో ఎన్నో రకాల వార్తలు వెలువడ్డాయి.
చిరంజీవి తన కుటుంబానికి తగిన వాడు కాదని అర్థం అయ్యి పెళ్లి క్యాన్సిల్ చేసాడని, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ ని తొక్కేసాడు అంటూ రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఉదయ్ కిరణ్ అక్క ఈ విషయంపై మాట్లాడుతూ, అసలు మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, చిరంజీవి గారు ఉదయ్ ని సొంత బిడ్డలాగానే చూసుకున్నాడు. ఉదయ్ బాగా లౌ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన ప్రోత్సాహం మేము ఎప్పటికీ మరువలేము, ఉదయ్ కిరణ్ కి ఎందుకో సుస్మిత కరెక్ట్ కాదు అని అనిపించింది, ఇదే విషయాన్నీ చిరంజీవి గారితో చెప్పి పెళ్లి ఆపించాడు.
అంతకు మించి ఏమి జరగలేదు, చాలా సమరస్యంగానే ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే కొన్ని పచ్చ మీడియా చానెల్స్ చిరంజీవి ని దోషిగా చూపించి ఈ రెండు దశాబ్దాలు ఆయన ఇమేజి కి ఎంత డ్యామేజ్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనా ఉదయ్ కిరణ్ చనిపోవటంతో టాలీవుడ్ ఒక మంచి విలక్షణ నటుడిని కొలిపోయింది అనే చెప్పుకోవాలి. ఒక వేళా ఉదయ్ కిరణ్ గాని ఇంకా బతికి ఉంటె కచ్చితంగా తన కున్న నటనా నైపుణ్యంతో టాలీవుడ్ లోనే టాప్ హీరోగా నిలిచే వాడు. ఉదయ్ కిరణ్ ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలి అని మేము కోరుకుంటున్నాము.