Umair Sandhu About Tollywood: సోషల్ మీడియా ని మాధ్యమంగా చేసుకొని ఫేమ్ సంపాదించడం ఈమధ్య చాలా మందికి అలవాటు అయిపోయింది. తిట్లు తిని అయినా క్రేజ్ సంపాదించుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని చూసి జాలీ పడాలో, లేదా చెప్పు తీసుకొని కొట్టాలో అర్థం కాదు. పాపులర్ అవ్వాలి అనుకోవడం లో తప్పు లేదు కానీ,ఎదుటి వ్యక్తి క్యారెక్టర్స్ ని తక్కువ చేస్తూ మాట్లాడి పాపులారిటీ సంపాదించుకోవడం అనేది అత్యంత నీచమైన చర్య. అలాంటి చర్యలు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సందు చేసునే ఉన్నాడు. గతం లో ఇతగాడు విడుదల అయ్యే సినిమాలను ముందుగానే చూసాను అంటూ చెప్పుకొని తిరిగేవాడు.
సినిమా సూపర్ గా ఉందని, ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తుంది అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు. కానీ ఇతను చెప్పినవి ఒక్కటి నిజం కాలేదు. ఇక ఆ తర్వాత సినిమాలపై విడుదలకు ముందే నెగటివ్ రివ్యూస్ ఇచ్చేవాడు. అది కూడా సక్సెస్ కాలేదు. ఏమి చేసినా సక్సెస్ అవ్వడం లేదనే అక్కసు తో ఇతగాడు హీరో హీరోయిన్స్ వ్యక్తిగత జీవితాలపై కన్నేసి, అతి నీచమైన అభియోగాలు వెయ్యడం ప్రారంభించాడు. ఇది అతగాడికి బాగా వర్కౌట్ అయ్యింది. దీనితో అప్పటి నుండి ఇతను నోటికి ఏది తోచితే అది మాట్లాడడం ప్రారంభించాడు(Umair Sandhu About Tollywood).
నాలుకకి నరం లేదు కాబట్టి ఇష్టమొచ్చిన రూమర్స్ ని స్ప్రెడ్ చెయ్యడం మొదలు పెట్టాడు. రీసెంట్ గా ఇతగాడు తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ హీరో హీరోయిన్స్ పై చేసిన అతి నీచమైన కామెంట్స్ సోషల్ మీడియా లో పెను దుమారమే రేపుతోంది. ఆయన మాట్లాడుతూ 1980 మరియు 1990 సంవత్సరం నాటి సౌత్ హీరోలు హీరోయిన్స్ తో షూటింగ్ స్పాట్ లోనే పడుకునేవారు. వాళ్లకి అమ్మాయిలంటే అసలు గౌరవమే లేదు, అమ్మాయిలను కేవలం సె** కోసం వాడుకునే వస్తువు లాగానే చూసేవారు. వాళ్ళ బాగోతం మొత్తం త్వరలోనే బయటపెడుతాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇన్ని రోజులు నేటి తరం హీరోలు , హీరోయిన్స్ ని టార్గెట్ చేసిన ఉమర్, ఇప్పుడు ఏకంగా అలనాటి హీరోలు, హీరోయిన్ల పై అభియోగాలు వేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఇతను చేసే చర్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తూ బూతులు తిడుతున్నా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వ్యవహరిస్తూ, నాకు కావాల్సింది మీరు నన్ను తిట్టి, నాకు రీచ్ ఇవ్వడమే అని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఉమైర్ సాందు తెలుగు మరియు తమిళ్ హీరోల నిజస్వరూపం బయటపెడతానని శబధం చేసాడు. చూదాం ఎం నిరూపిస్తాడో.