Home Cinema Upasana : ఉపాసన ధరించిన ఈ లైట్ పింక్ డ్రెస్ విలువ ఎంతో తెలిస్తే అస్సలు...

Upasana : ఉపాసన ధరించిన ఈ లైట్ పింక్ డ్రెస్ విలువ ఎంతో తెలిస్తే అస్సలు నమ్మరు..

Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్ గా ఉంటారో, బయట కూడా అంతే స్టైలిష్ గా ఉంటాడు. ఆయన స్టైలింగ్ ని యూత్ తెగ ఫాలో అవ్వడాన్ని మనం గమనించొచ్చు. ముఖ్యంగా ఆయన వేసుకునే దుస్తులు చూపురులను చాలా ఆకర్షిస్తుంది. ఆయనతో దాంపత్య జీవితం పంచుకున్న కారణంగా ఆయన సతీమణి ఉపాసన కూడా ఎంతో స్టైలిష్ గా మారింది(Upasana Dress Cost). రీసెంట్ గా వీళ్లిద్దరికీ సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అవ్వగా, అది తెగ వైరల్ గా మారింది. ఇందులో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు, ఇక ఉపాసన లైట్ పింక్ డ్రెస్ లో సింపుల్ గా కనిపించినప్పటికీ చాలా స్టైలిష్ గా కనిపించింది.

upasana-ram-charn

పాప పుట్టిన తర్వాత వీళ్లిద్దరు మొదటిసారి కలిసి ఫారిన్ కి వెళ్లారు. ఉపాసన స్నేహితురాలి పెళ్ళికి వీళ్లిద్దరు వెళ్లినట్టుగా తెలుస్తుంది. చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ లైట్ పింక్ డ్రెస్ విలువ అంత ఉంటుందా అని అభిమానులు నోరెళ్లబెడుతున్నారు(Upasana Dress Cost). ఈ డ్రెస్ లో ఉపాసన చూసేందుకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ డ్రెస్ ని హేలీ మెంజెస్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ తయారు చేయించారు. ఇక ఉపాసన తో పాటుగా ఉన్న రామ్ చరణ్ కూడా ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ కేవలం 50 రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో రామ్ చరణ్ మోడరన్ లుక్ లో కనిపిస్తూ అదరగొట్టాడు. ఇక రెండవ పాత్ర రాజకీయ నాయకుడి గెటప్ లో ఉంటుంది, ఈ పాత్రకి సంబంధించిన షూటింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి కానీ, సినిమా నుండి అధికారికంగా విడుదల కాలేదు. జనవరి లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసి, ఏప్రిల్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు.

#RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్, ఈ చిత్రంతో ఇంకా ఏ రేంజ్ కి వేళ్తాడో అనేది చూడాలి. గత ఏడాది వరకు అభిమానులు అందరి మదిలో ఒకటే ప్రశ్న ఎందుకు రామ్ చరణ్ ఉపాసన ఎందుకు ఇంకా పిల్లల్ని కనలేదు అని. ఫాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం అదే టాక్. కొంపతీసి వీరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కూడా మధ్యలో కొన్ని వార్తలు వచ్చాయి.

ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు కూడా అసలు పొట్ట పెద్దగా కనిపించ లేదు. ఈ విషయం కూడా చాలా వైరల్ అయ్యి చాలా చర్చలు జరిగాయి. అది నిజం పొట్టేనా, నిజంగానే ప్రెగ్నెంట్ ఆ అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఏదైతేనే కూతురు పుట్టింది, ఫాన్స్ ఇండస్ట్రీ మొత్తం హ్యాపీ.

Exit mobile version