Friday, September 20, 2024
HomeCinemaUpasana: అల్లు అర్జున్ కోసం అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఉపాసన.. మెగా కోడలా మజాకా..

Upasana: అల్లు అర్జున్ కోసం అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఉపాసన.. మెగా కోడలా మజాకా..

Upasana: ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎక్కడ చూసిన బలంగా వినిపిస్తున్న పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎన్నో ఏళ్ళ నుండి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది , ఎంతో మంది లెజెండ్స్ మన ఇండస్ట్రీ లో ఉన్నారు. కానీ ఏ హీరోకి కూడా దక్కని నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దక్కించుకున్నాడు. అందుకే ఆయనకు ఎక్కడ చూసినా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది(Upasana Gift Allu Arjun). ఆయన తోటి హీరోల అగ్గర నుండి , రాజకీయ నాయకుల వరకు ప్రతీ ఒక్కరు మన తెలుగోడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. జీవితం లో ఒక నటుడు ఇంతకు మించి సాధించాల్సింది ఇంకేమి ఉంది?

upasana-gift-to-allu-arjun

అల్లు అర్జున్ పడిన కష్టానికి దక్కుతున్న ఫలితం, పని పట్ల అతనికి ఉన్న అంకిత భావంకి ఈ మాత్రం గౌరవం దక్కడం సబబే. ఇక అల్లు అర్జున్ కుటుంబీకులకు ఎంత ఆనందం గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఎగిరి గంతులేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ కి అవార్డు రావడం పై ఎంతో హర్షం వ్యక్తం చేస్తుంది. సోషల్ మీడియా లో ఎప్పటి నుండో అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ran-charan-allu-arjun

తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ కొట్టుకుంటూనే ఉంటారు. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ రీసెంట్ గా రామ్ చరణ్ మరియు ఉపాసన పంపిన గిఫ్ట్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ గా పెట్టాడో, అప్పటి నుండి ఈ ఇరువురి హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ తగ్గాయి. ఇక్కడ మనం ఎంత కొట్టుకున్న నిజ జీవితం లో వాళ్లిద్దరూ బంధువులు, మనం కూడా అలాగే ఉండాలి అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అల్లు అర్జున్ పెట్టిన స్టోరీ ఏమిటంటే, రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన కలిసి పంపిన ఫ్లవర్ బొకే ని ఫోటో తీసి పెట్టాడు(Upasana Gift Allu Arjun).

allu-arjun-upasana

అందులో ఉన్న మెసేజి ఏమిటంటే ‘కంగ్రాట్స్ బన్నీ. నీకు నేషనల్ అవార్డు దక్కినందుకు మాకు ఎంతో సంతోషం గా ఉంది, నువ్వు పడిన కష్టానికి తగ్గినా ఫలితం’ దక్కింది అంటూ ఒక చిన్న కార్డు లో మెసేజి ఉంది. రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తూ చాల బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది.

అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా చేస్తూ యమా బిజీ గా ఉన్నాడు, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేదాం అనుకుంటున్నారు సినిమా నిర్మాతలు. అల్లు అర్జున్ దిశ మార్చే సినిమా గా ఉండబోతుంది పుష్ప 2.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts