Rambha: రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన శిష్యులు చాలా డిఫరెంట్ యాటిట్యూడ్ తో రామ్ గోపాల్ వర్మ లాగానే ప్రవర్తిస్తుంటారు అని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉన్న టాక్. అలా రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన నటులలో ఒకడు జేడీ చక్రవర్తి. వర్మ మొదటి సినిమా ‘శివ’ సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన జేడీ చక్రవర్తి, అదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాడు(Uttej About Rambha). అలా ప్రారంభమైన జేడీ చక్రవర్తి కెరీర్, ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నెమ్మదిగా హీరో గా మారి,
గులాబీ, మనీ మనీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయరా ఇలా ఒక్కటా రెండా, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన జేడీ చక్రవర్తి, చాలా కాలం తర్వాత హీరో గా ‘దయ’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి తో పాటు కమల్ కామరాజు, ఇషా రెబ్బ, యాంకర్ విష్ణు ప్రియా, పృథ్వీ రాజ్ తదితరులు నటించారు. రీసెంట్ గానే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జేడీ చక్రవర్తి తో పాటు మూవీ యూనిట్ మొత్తం పాల్గొంది. ఇక ఈ ఈవెంట్ జేడీ చక్రవర్తి ప్రాణ స్నేహితుడు ఉత్తేజ్ (Uttej About Rambha) మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ మేమిద్దరం చాలా ఏళ్ళు పంజాగుట్ట లో ఉండేవాళ్ళం, అక్కడ ప్రముఖ హీరోయిన్ రంభ తొడలను చూసేందుకు వెళ్లే బ్యాచ్ లో మేము కూడా ఒక్కటి. మేము ఉండే పరిసరాల్లో రంభ కొత్త సినిమాకి సంబంధించిన కటౌట్ ఒకటి పెట్టారు. అబ్బా ఏముందిరా ఈ అమ్మాయి అని అనుకునేవాళ్లం.
కానీ అదే అమ్మాయి తో కొన్ని రోజుల తర్వాత ‘బొంబాయి ప్రియుడు’ సినిమా లో నటించే రేంజ్ కి ఎదిగాము’ అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ జేడీ కి దర్శకత్వం అంటే పిచ్చి అని, అనవసరంగా అటు వైపు వెళ్ళాడు, హీరో గా అలాగే కొనసాగి ఉంటే నేడు జేడీ చక్రవర్తి రేంజ్ మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు ఉత్తేజ్. ఖడ్గం సినిమాతో సైడ్ ఆక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్న ఉత్తేజ్, ఎన్నో సినిమాల్లో సైడ్ ఆక్టర్ గా నటించి మంచి పేరే సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కి తమ్ముడు లాంటి వాడు ఉత్తేజ్.