Sunday, July 7, 2024
HomeCinemaVaishnavi: షణ్ముఖ్ వల్ల వైష్ణవి చైతన్య లవ్ బ్రేక్ అప్.. ఏంచేసాడంటే..

Vaishnavi: షణ్ముఖ్ వల్ల వైష్ణవి చైతన్య లవ్ బ్రేక్ అప్.. ఏంచేసాడంటే..

Vaishnavi : యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ మంచి పాపులారిటీ ని దక్కించుకున్న వైష్ణవి చైతన్య అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. అలా కెరీర్ ని నెట్టుకొస్తున్న వైష్ణవి చైతన్య రీసెంట్ గా ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా నటించి, ఆ చిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే(Vaishnavi Chaitanya Breakup). రీసెంట్ గానే ఆమె ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. రాబొయ్యే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

vaishnavi-chaitanya

అయితే ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ముందు యూట్యూబ్ లో ప్రముఖ యూట్యూబర్స్ తో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ మరియు కవర్ డ్యాన్స్ లు చేసింది. అలా ఈమెకి ప్రముఖ యూట్యూబర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ పరిచయం అయ్యాడు. ఇతనితో కలిసి ఎన్నో వీడియోస్ చేసింది వైష్ణవి చైతన్య. ఆ వీడియోస్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. అయితే వీళ్ళ మధ్య ఇలా ఏర్పడిన ఈ పరిచయమే ప్రేమగా మారిందట. ఇద్దరు చాలా కాలం వరకు డీప్ గా లవ్ చేసుకున్నారట. కానీ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కారణం గా వీళ్లిద్దరి లవ్ బ్రేకప్ అయ్యిందని లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త.

Vaishnavi-Chaithanya-mehboob-dil-se

షణ్ముఖ్ జస్వంత్ తో వసిహ్నవి చైతన్య కలిసి ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ అప్పట్లో యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేసింది. ఈ సిరీస్ ఎంత పెద్ద హిట్ అంటే, సినిమాల్లో బాహుబలి సిరీస్ ఎంత పెద్ద హిట్టో, యూట్యూబ్ లో ఈ సిరీస్ కూడా అంత పెద్ద హిట్ అన్నమాట. ఈ సిరీస్ తర్వాతే వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోయింది. సినిమాల్లో అవకాశాలు రావడం కూడా మొదలయ్యాయి. అయితే ఈ సిరీస్ చేస్తున్న సమయం లో షణ్ముఖ్ జస్వంత్ మరియు వైష్ణవి చైతన్య క్లోజ్ గా మూవ్ అవ్వడం చూసి మెహబూబ్ గొడవలు పడేవాడట.

mehboob-dilse

అలా వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు పీక్ రేంజ్ కి వెళ్లి, ఒకరోజు విడిపోయారట(Vaishnavi Chaitanya Breakup). మెహబూబ్ కి ఉన్న అపోహల కారణంగానే వీళ్ళ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కలేకపోయిందని టాక్. బేబీ సినిమా తరువాత వైష్ణవి చైతన్య కి బనే సినిమా అవకాశాలు వస్తాయి అని అందరూ భావించారు. అనుకున్నంత కాకపోయినా 2-3 సినిమా సైన్ చేసింది వైష్ణవి. కానీ ఫాన్స్ మాత్రం ఇంకా ఎక్కువ ఆఫర్ లు వస్తాయి అని భావించారు.

తిను ఒక్క సినిమా నే కదా తీసింది అప్పుడే ఫాన్స్ ఏంటి అని అనుకుంటున్నారా.? తిను ఒక్క సినిమానే తీసి ఉండొచ్చు కానీ తిను యూట్యూబ్ లో చాలా ఫేమస్. పెద్ద ఫాన్స్ బేస్ ఉంది వైష్ణవికి. ఇక సినిమాలో కూడా యూట్యూబ్ లో వచ్చిన సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాము.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts