Sunday, July 7, 2024
HomeCinemaVaishnavi Chaitanya : బంపర్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలో...

Vaishnavi Chaitanya : బంపర్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్..

Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య.. ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియా లో తెగ ట్రేండింగ్ అవుతుంది. ఎక్కడ చూసిన ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు సినిమా పెద్దలు మరియు ప్రేక్షకులు. వైష్ణవి(Vaishnavi Chaitanya Puri Jagannadh) ఇటీవల విడుదలైనా బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి, ఆ సినిమా బారి విజయం సాధించడానికి ఆమె కూడా తన వొంతు నటనను ప్రదర్శించింది. ఈ సినిమా చిన్న బడ్జెట్ తో తీసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు 80 కోట్ల కలెక్షన్ సాధించింది.

vaishnavi-chaitanya-got-bumper-offer-as-heroine-in-puri-jagannadh-double-ismart-pan-indian-movie

ఇలా సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇప్పుడు వైష్ణవి చైతన్య గురించి మరో వార్తా వైరల్ అవుతుంది. ఈ అమ్మడు తానూ నటించిన మొదటి సినిమా తోనే బంపర్ ఆఫర్ కొట్టేసిందట. అవును మీరు వినేది నిజమే.. వైష్ణవి చైతన్య తన రెండో చిత్రం పాన్ ఇండియా దర్శకుడితో చేస్తుందట. అయితే ఇపుడు మనం దీనికి సంబందించిన వివరాలు తెలుసుకుందాం. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయ్యాడట పాన్ ఇండియా డైరెక్టర్ పూరి జగన్నాధ్.

vaishnavi chaithanya in puri jagannadh double ismart

ఈ నటిని తన రాబోయే చిత్రం డబల్ ఇస్మార్ట్ లో సెకండ్ హీరోయిన్ గా ఓకే చేసాడట పూరి. డబల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్. ఈ సినిమా మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది మరియు పూరి ఈ సినిమా యొక్క రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేసాడు అని అందరికి తెలిసిన విషయమే. వైష్ణవి చైతన్య డబల్ ఇస్మార్ట్ లో రామ్ పోతినేని సరసన నటిస్తుంది మరియు మాస్ స్టెప్పులు వేయబోతుందని తెలుస్తుంది.

vaishnavi chaithanya pan indian movie

మొన్న బేబీ సక్సెస్ అయ్యాక రామ్ పోతినేని వైష్ణవి ఇంటికి సిర్ప్రైస్ గా ఫ్లవర్ బొకే పంపించారు. దీనిని స్వయంగా వైష్ణవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ అమ్మడు ఈ సినిమా తరువాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఓ సినిమాలో అల్లు శిరీష్ సరసన నటించడానికి ఓకే చెప్పేసింది.

ఇలా వైష్ణవి ప్రస్తుతం బిజీ బిజీ గా ఉంది. ఈ న్యూస్ చుసిన ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలానే ఈ నటి వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్(Vaishnavi Chaitanya Puri Jagannadh) గా ఎదగాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts