Vaishnavi Chaitanya : ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి పోస్ట్‌లు చేసి, వాటిని ట్రెండ్ గా మార్చడం చాలా కామన్ గా మారింది. కొందరు హీరోయిన్లు వీటిని చూడనట్లు వదిలేస్తే, మరికొందరు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అయితే, కొంతమంది భావోద్వేగాయానికి గురై బాధపడుతూ వారి బాధను తెలియజేస్తుంటారు. తాజాగా అదే జాబితాలోకి వైష్ణవి చైతన్య చేరిపోయింది. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఇప్పుడు బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే.
బేబీ చిత్రంలో వైష్ణవి విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది మరియు వైష్ణవి చైతన్య స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల వైష్ణవి చైతన్య ఆశిష్‌తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఆశిష్ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన చిత్రం లవ్ మీ. ఈ సినిమాను యంగ్ దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నాడు మరియు ఇది ఆయన మొదటి చిత్రం. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్లో వైష్ణవి చైతన్య మాటలకు కీరవాణి ఫ్లాట్ అయిపోయారు. అంతేకాదు వేదికపై వైష్ణవి చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. ‘సుదీర్ఘ శ్రమ తర్వాత ఈ స్థాయికి చేరుకున్నాను. కానీ కొంతమంది ఆకతాయిలు తన ఫోటోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలతో వాటిని పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి అని ఆమె రిక్వెస్ట్ చేసింది. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.