Baby Movie: రీసెంట్ సమయం లో ప్రమోషనల్ కంటెంట్ ద్వారా భారీ అంచనాలను ఏర్పాటు చేసి, విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుండే దుమ్ము లేపే వసూళ్లతో ట్రేడ్ పండితులు సైతం అవాక్కు అయ్యే కలెక్షన్స్ ని రాబడుతూ సంచలనం సృష్టిస్తుంది (Vaishnavi Chaitanya Mother Reaction). కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోలుగా చేసిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కంటే కూడా ఎక్కువగా వైష్ణవి చైతన్య కి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వైష్ణవి చైతన్య మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రం లో వైష్ణవి చైతన్య చాలా సన్నివేశాల్లో బోల్డ్ గా రొమాంటిక్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే (Vaishnavi Chaitanya Mother Reaction). ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిల్చింది. దీని గురించి ఆమె తన ఇంట్లోని అమ్మానాన్నలు ఎలా అనుకున్నారో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ఈ సింబీమాలు చాలా రొమాన్స్, లిప్ లాక్స్ ఉన్నాయి. అలమివి చెయ్యాలంటే నాకు చాలా ఇబ్బంది, అందుకే సెట్స్ లో ఎవరూ లేకుండా ఉండేట్టు చూసుకున్నాడు డైరెక్టర్. విరాజ్ కూడా నాకు చాలా సహాయం చేసాడు. నాకు చాలా కంఫర్ట్ ఇవ్వబట్టే ఆ సన్నివేశాల్లో నటించగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య. ఇక ఈ సన్నివేశాలు ఇంట్లోని తన పేరెంట్స్ చూసిన తర్వాత అదంతా సినిమా కోసమే చేసానని వాళ్ళు అర్థం చేసుకున్నారు. లిప్ లాక్స్ చేసింది, రొమాన్స్ చేసింది అని వాళ్ళు పట్టించుకోలేదు, కేవలం సినిమాలోని ఎమోషన్స్ ని మాత్రమే చూసారు అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.
ఒక్క సినిమాతో ఇండస్ట్రీ లో ఈ రేంజ్ ప్రకంపనలు పుట్టించిన వైష్ణవి చైతన్య, ఇక రాబొయ్యే కాలం లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించబోతుందో చూడాలి. బేబీ సినిమా మాత్రం ప్రస్తుతం థియేటర్ లో కుమ్మి పడేస్తుంది. యువతకి ఈ సినిమా బాగా గుచ్చుకుంది, ఈ సినిమా ఇప్పటికే మంచి డబ్బు కాలేచ్ట్ చేసేసింది. ప్రస్తుతం లాభాల బాటలో ఉంది ఈ సినిమా, ఈ సినిమాతో హీరోయిన్ వైష్ణవి చైతన్య దిశా మారిపోబోతుంది అంటున్నారు అభిమానులు.