Home Cinema Varun-Lavanya: వరుణ్ లావణ్యాల పెళ్లి ఆ దేశంలో జరగబోతుంది అని మీకు తెలుసా..

Varun-Lavanya: వరుణ్ లావణ్యాల పెళ్లి ఆ దేశంలో జరగబోతుంది అని మీకు తెలుసా..

Varun-Lavanya: గత నెల 9 వ తారీఖున మెగా బ్రదర్ నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ మరియు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి ఆగష్టు 24 వ తారీఖున గ్రాండ్ గా జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే వీళ్ళ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది(Varun Lavanya Marriage Venue). అదేమిటంటే వీళ్లిద్దరి పెళ్లి ఇండియా లో జరగదట, స్పెయిన్ లో జరుగుతుందట. గత కొంతకాలం గా ఇంస్టాగ్రామ్ లో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి స్పెయిన్ లో తిరుగుతూ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

varun-lavanya-marriage-venue

నెటిజెన్స్ పెళ్లి కాకుండానే వీళ్లిద్దరు హనీమూన్ వెకేషన్ కి వెళ్లారని అందరూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ చేస్తూ ఉండేవారు. కానీ వీళ్ళు వెళ్ళింది హనీమూన్ వెకేషన్ కి కాదు, పెళ్లి పనులు చూసుకోవడానికే. లావణ్య త్రిపాఠి కి అక్కడ పెళ్లి చేసుకోవాలని కోరిక ఉండడం తో వరుణ్ తేజ్ రిక్వెస్ట్ మీద నాగబాబు అక్కడ పెళ్లి చెయ్యడానికి ఒప్పుకున్నాడట. కానీ ఈ పెళ్ళికి టాలీవుడ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ కి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఆహ్వానం పలకడం లేదట. కేవలం అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మరియు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే హాజరవుతాయట.

స్పెయిన్ వరకు వచ్చే వెసులుబాటు ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు(Varun Lavanya Marriage Venue). అయితే వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లోనే జరుగుతుందని, ఈ ఈవెంట్ కి మాత్రం అందరూ హారాజారవుతారని అంటున్నారు. గతం లో వరుణ్ తేజ్ చెల్లి నిహారిక పెళ్లి కూడా ఇలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ తో రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలస్ లో జరిగింది. కానీ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ మాత్రం దేశం కానీ దేశం లో జరుగుతుంది. అయితే ఈ పెళ్ళికి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అవుతాడా లేదా అనేది చూడాలి.

అప్పటికే వారాహి యాత్ర లో ఫుల్ బిజీ గా ఉండే కళ్యాణ్,ఇలా పక్క దేశానికీ వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. అదే జరిగితే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. వరుణ్ లావణ్య అంతరిక్షం అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు ఈ జంట. మొదట్లో చిరంజీవి పెళ్ళికి నో చెప్పడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది, చివరికి ఎలాగో ఆలా చిరు నాగబాబు లను ఒప్పించి పెళ్లి చేసేసుకో బోతున్నారు. మెగా ఫాన్స్ మాత్రం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఈ పెళ్లి ఇపుడు జరగబోతుంది.

Exit mobile version