Allu Arjun : సినీమా ఇండస్ట్రీలో అందరు నటీనటులు బయటకు అందంగా మరియు ప్రశాంతగా ఉంటారు కానీ వారికి కోపం వస్తే ఎం చేస్తుంటారో మనకు అసలు తెలీదు. వారు కూడా మనుషులే, వారికీ కోపం మరియు దుఃఖం వంటివి ఉంటాయి. వారి సినిమా టెన్సన్స్ తో పాటు పర్సనల్ ప్రొబ్లెమ్స్ తో ఎప్పుడు ఇదొక్కటి ఉంటూనే ఉంటది. ఒక్కకొకరు కోపం (Allu Arjun Angry) వస్తే ఒక్కోలా రియాక్ట్ అవుతుంటారు. మన టాలీవుడ్ లో స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ కోపం వస్తే ఎం చేస్తాడో మన అందరికి తెలుసు.
ఎన్టీఆర్ కు కోపం వస్తే వంటింట్లోకి వెళ్లి కుకింగ్ చేస్తాడని ఆయనే చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కోపం వస్తే కంట్రోల్ చేసుకోవడానికి ఏమో ఏమో చేస్తుంటారు. ఇక ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న కృతి శెట్టి కూడా తనకు ఎవరి మీద అయినా కోపం వస్తే వారితో గొడవపడకుండా ఒక గడ్డిలోకి వెళ్లి లాక్ చేసుకొని పాడుకుంటాడని ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలానే మన బన్నీ కూడా ఆయనకు కోపం వస్తే ఎం చేస్తారో చెప్పారు.
అల్లు అర్జున్ కు ఎవరి మీద అయినా కోపం వస్తే వారి మీద అరిచేస్తాడంట, కానీ తన కుటుంబంలో ఎవరి మీదైనా కోపం వస్తే వారిమీద కూడా అలా అరవకుండా తన గడ్డిలోకి వెళ్లి ఒక్కడే కూర్చొని అసలు కోపానికి కారణమేంటో అని ఆలోచిస్తారట. అలా కొద్దీ సేపటికి ఆయన మైండ్ కూల్ అయ్యకు బయటకు వచ్చి ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్ పిల్లల డేగరికి వెళ్లి కొంత సమయం గడుపుతాడట. ఇలా చేయడం వాళ్ళ నా కోపం మొతం పోయి కూల్ గా ఉంటా అని బన్నీ తెలిపారు.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి కనిపించే అంత సౌమ్యుడు కాదని తెలుస్తోంది. ఆయనకు కోపం వస్తే షూటింగ్ సెట్లలో మైక్ లు పగలకొడుతారట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉందంట. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ షూటింగ్లో బిజీ బిజీ గా ఉన్నారు మరియు ఈ సినిమాకు సంబదించిన గ్లిమ్ప్స్ కూడా విడుదల చేసారు. (Allu Arjun Angry)
ఈ సినిమా పుష్ప ది రైస్ కు సీక్వెల్. దీని మొదటి భాగము మంచి సక్సెస్ అందుకుంది. పుష్ప రెండో భాగము కూడా బారి విజయం సాధించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మరియు దర్శకుడు సుకుమార్ కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాము.