Soundarya: అందం ఒక మనిషికి వయస్సు దాటినా తర్వాత తరగిపోవడం సహజం, కానీ ప్రతిభ ఎంత వయస్సు వచ్చినా తరగిపోదు, అవకాశాలు ఎదో విధంగా కలిపిస్తూనే ఉంటాయి అని చెప్పడానికీ, అన్నీ రంగాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగుల ప్రపంచం అని పిలవబడే సినీ రంగం లో కూడా ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అయితే హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి కచ్చితంగా అందాల ఆరబోత చెయ్యాల్సిందే,లేకుంటే ఇండస్ట్రీ లో మనుగడ కష్టం అని అంటుంటారు కొంతమంది విశ్లేషకులు.
కానీ అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా, నమ్ముకున్న సిద్ధాంతాలను తూచా తప్పకుండ ఫాలో అవుతూ ఇండస్ట్రీ లో మహానటి సావిత్రి తర్వాత అంత గొప్ప నటి అని నిఒప్పించుకున్న హీరోయిన్ సౌందర్య. ఈమె దురదృష్టం కొద్దీ హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు. ఆమెని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్స్ ఉండొచ్చు కానీ, ఆమె రేంజ్ ని మాత్రం చేరుకోలేకపోయారు అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే సౌందర్య(Soundarya) కి ఆయుష్షు ఎక్కువ లేదని జ్యోతిష్యులు ఆమె తండ్రికి ఎప్పుడో చెప్పారట.
జోతిష్యులు చెప్పింది చెప్పినట్టు జరగాలని రూల్ ఏమి లేదు కదా, సౌందర్య విషయం లో కూడా అలాగే జరుగుతుంది లే అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, ఆయుష్షు ని పెంచుకునేందుకు ఎలాంటి హోమాలు కానీ , పూజలు కానీ చేయించిన దాఖలాలు లేవు. పెళ్ళైన పక్క సంవత్సరం లోనే ఈ దుర్ఘటన జరిగింది. మరో భయం కలిగించే విషయం ఏమిటంటే, సౌందర్య(Soundarya) అప్పట్లో కన్నడం లో ‘ఆప్తమిత్ర ‘ అనే చిత్రం చేసింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లో ఒక చెడు శక్తి సినిమాలో పని చేస్తున్న ప్రతీ ఒక్కరినీ ఆవహించిందట.
ఈ సినిమాకి ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేసిన శశికళ అనే అమ్మాయి ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. డబ్బింగ్ చెప్తున్నా సమయం లో తనని ఎదో దుష్ట శక్తి భయపెడున్నట్టు గా అనిపించిందని, సౌందర్య(Soundarya) ని కూడా ఆ దుష్ట శక్తి ఆవహించడం వల్లే చనిపోయిందని, ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విష్ణు వర్ధన్ కూడా చనిపోవడానికి కారణం అదేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారింది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలియదు కానీ, రజినీకాంత్ కూడా ఇందుకు భయపడే చంద్రముఖి సీక్వెల్ చెయ్యడానికి ఒప్పుకోలేదు అని అందరు అంటుంటారు.