Sunday, July 7, 2024
HomeCinemaSoundarya: ఎంతో పద్దతిగా ఉండే సౌందర్య పై ఇంత చెండాలపు రూమర్ ఉందా..

Soundarya: ఎంతో పద్దతిగా ఉండే సౌందర్య పై ఇంత చెండాలపు రూమర్ ఉందా..

Soundarya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సహజ నటనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత అంత గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. దురదృష్టం కొద్దీ ఈమె హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోయి మన అందరినీ వదిలి తిరిగిరాని లోకాలకు ప్రయాణం అయ్యింది. ఆమె మనల్ని వదిలి ఇన్ని రోజులు అయ్యినప్పటికీ కూడా జనాలు ఆమెని మర్చిపోలేకపోతున్నారు(Rumor On Soundarya). ఇప్పటికీ సహజ నటన టాపిక్ వస్తే అందరూ సౌందర్య పేరు ఎత్తుతారు.

soundarya

ఆమెని రీ ప్లేస్ చేసే హీరోయిన్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఎవ్వరూ రాలేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆమె నటనని దగ్గరగా మ్యాచ్ చేసిన హీరోయిన్స్ అయితే ఉన్నారు కానీ, పూర్తి స్థాయిలో సౌందర్య ని డామినేట్ చేసిన హీరోయిన్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు(Rumor On Soundarya). ఏ హీరో తో నటించినా కూడా మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగ అనిపిస్తుంది సౌందర్య తో చేస్తే. అందుకే అందాల ఆరబోతకు ఆమె ఏమాత్రం ఒప్పుకోకపోయినా కూడా దర్శక నిర్మాతలు ఆమె కాల్ షీట్స్ దొరికితే చాలు అని అప్పట్లో యుద్దాలు చేసేవారు.

soundarya-jagathi-babu

ఆమె బ్రతికి ఉంది ఉంటే ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతూ ఉండేది. సౌందర్య ఇప్పటి వరకు నటించిన హీరోలలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిన హీరో ఎవరు అంటే జగపతి బాబు అని చెప్పడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. వీళ్లిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. మన ఇండస్ట్రీ లోనే కాదు, ఎక్కడైనా ఒక హీరో , ఒక హీరోనే కలిసి మూడు నాలుగు సినిమాలు చేస్తే వాళ్ళ మధ్య ఎదో నడుస్తుంది అన్ని పుకారు పుట్టించేస్తారు.

jagapathi-babu-soundarya

ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి అలాంటి రూమర్స్ వ్యాప్తి చెందడం సహజం అనుకుందాం, కానీ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఈ వార్త అంతలా ప్రచారం అయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో పుకార్లు పుట్టించారు అనేది. దీని పై జగపతి బాబు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ‘సౌందర్య నేను మంచి స్నేహితులం. ఆమె నన్ను అన్నయ్య అని పిలిచేది, అలాంటి అమ్మాయి తో ఎక్కువ గా సినిమాలు చేశాను అనే కారణం చేత ఇలాంటి పుకార్లు పుట్టించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts