Saturday, November 23, 2024
HomeCinemaSridevi: ఆ ఫంక్షన్ లో చెప్పుతో శ్రీదేవి చెంప పగలకొట్టింది ఎవరు..

Sridevi: ఆ ఫంక్షన్ లో చెప్పుతో శ్రీదేవి చెంప పగలకొట్టింది ఎవరు..

Sridevi Got Slapped: బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు మరియు తమిళం భాషల్లో ఏనీతో మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్స్ లో ఒకరు శ్రీదేవి. ఈమె కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ లో కూడా ఎన్నో దశాబ్దాలు స్టార్ హీరోయిన్ గా, నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయ్యినప్పటికీ కూడా, ఇప్పటికీ ఆమెని ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారంటే, ఆమె ప్రేక్షకుల మదిలో వేసిన చెరగని ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

sridevi-got-slapped

ఈమె అప్పట్లో చాలా మంది హీరోలతో అఫైర్స్ నడిపింది అంటూ రూమర్స్ వచ్చాయి. కానీ చివరికి బాలీవుడ్ బడా నిర్మాత, అనిల్ కపూర్ సోదరుడు బోణి కపూర్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈ దంపతులిద్దరికీ జాన్వీ కపూర్, ఖుషి కపూర్ అని ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. వారిలో జాన్వీ కపూర్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా శ్రీదేవి ని అప్పట్లో ఆమె సొంత అత్తయ్య ఒక సినీ ఫంక్షన్ లో చెప్పు తీసుకొని కొట్టింది అనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. అసలు విషయానికి వస్తే ఆమె బోణి కపూర్ కి అప్పటికే పెళ్లి అయ్యింది అనే విషయాన్ని తెలిసి కూడా అతనిని ప్రేమించింది.

sridevi-boney-kapoor

ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంది. పెళ్ళికి ముందే డేటింగ్ కారణంగా శ్రీదేవి గర్భం దాల్చింది. గర్భం తోనే ఆమె పెళ్లి కూడా చేసుకుంది. ఈ విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత బోణి కపూర్ తల్లి శ్రీదేవి పై ఆవేశం తో రగిలిపోయింది(Sridevi Got Slapped). ఆమె కనిపిస్తే చెప్పు తో కొట్టాలి అని ఎదురు చూస్తూ ఉన్న బోణి కపూర్ తల్లి, ఒక సినిమా ఫంక్షన్ లో, విశిష్ట అతిథులు చూస్తుండగానే చెప్పు తో కొట్టి ఇష్టమొచ్చినట్టు తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాపం శ్రీదేవి తలదించుకుని ఏడుస్తూ ఆరోజు అక్కడి నుండి వెళ్లిపోయిందట. అప్పట్లో శ్రీదేవి అభిమానులు కూడా ఈ విషయంపై చాలా హర్ట్ అయ్యారు.

veteran-actress-sridevi

ఇప్పటికీ ఆమెకి శ్రీదేవి మీద కోపం అలాగే ఉంటుంది అని బాలీవుడ్ లో ఒక టాక్ ఉంది. ఇకపోతే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించు కుంటుంది. బాలీవుడ్ లో పెద్ద హిట్టులు, పేరు రాక అమ్మ బాటలో నడవాలి అని ఫిక్స్ అయినట్టు ఉంది పాప. ఎన్టీఆర్ తో తాను చేసే సినిమాపై ఫాన్స్ కు భారీ అంచనాలే ఉన్నాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts