Sunday, July 7, 2024
HomeCinemaVijay Devarakonda : ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Vijay Devarakonda : ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Vijay Devarakonda : ప్రస్తుతం యావత్ భారత సినీ ప్రేక్షకుల కళ్ళు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మీదే ఉంది అనడంలో ఎలాంటి సందేహాహం లేదు. బాహుబలి సినిమాతో ఇది సాధ్యమైంది. ఈ సినిమా తరువాత సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి కెజిఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో బారి సక్సెస్ అందుకున్నాయి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సౌత్ సినిమాలపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరక్కేక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా ఉన్నారు అనే విషయం మన అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో మరో యువ హీరో కూడా ఉన్నదంటూ ఓ వార్తా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఉన్నదంటూ ఇంటర్నెట్ లో ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది.

vijay-devarakonda-in-prabhas-kalki-2898-ad-cinema

మరి ఈ వార్తలకు కారణం ఆయన ఇటీవల కల్కి సినిమా సెట్స్ లో దిగిన ఫోటో బయటకు వచ్చింది. దీనితో ఆయన అభిమానులు అందరు కల్కి సినిమాలో విజయ్ కూడా ఉన్నారంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందొ ఎవరికీ తెలీదు. ఇకపోతే కల్కి సినిమా జూన్ 27 న మన ముందుకు రాబోతుంది. ఈరోజే ఈ సినిమా ఆడియో విడుదలపై పోస్ట్ చేసారు చిత్ర యూనిట్. కల్కి సినిమా బారి విజయం సాధించి మన సౌత్ సినిమా ఇండస్ట్రీ మరోసారి చాటాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts