Wednesday, July 3, 2024
HomeCinemaVijay Devarakonda : ట్రోలర్స్ గువ్వా గుయ్యి మనిపించేలా విజయ్ దేవరకొండ రిప్లై.. మామూలు మాస్...

Vijay Devarakonda : ట్రోలర్స్ గువ్వా గుయ్యి మనిపించేలా విజయ్ దేవరకొండ రిప్లై.. మామూలు మాస్ కాదు..

Vijay Devarakonda : మన టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ఇటీవల నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో విఫలమైంది. కానీ ఇదే సంవత్సరం విజయ్ ఊహించని విధంగా అందరికి పెద్ద సుర్ప్రైస్ ఇచ్చాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాని తెరకేకించిన విషయం అందరికి తెలిసినదే. ప్రభాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో పాటు ఎంతో మంది స్టార్లు ఈ సినిమాలో క్యామియో రోల్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

అయితే కల్కి సినిమా అర్జునుడిగా టాలీవుడ్ సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించారు. ఈ పాత్రకు ప్రశంసలతో పాటు, ట్రోల్ దాడులు కూడా ఎదురుకుంటున్నారు విజయ్. దీంతో సోషల్ మీడియాలో ఇది చర్చాంశంగా మారింది. ప్రస్తుతం విజయ్ ట్రోల్ల్స్ చేసే అందరికి ఎం మాట్లాడకుండానే సమాధానం ఇచ్చాడు. విజయ్ అర్జునిడిగా సూట్ అవ్వలేదు అన్న ప్రతి ఒక్కరికి చెంపదెబ్బ కొట్టినట్లు అతను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ఫోటో గా అర్జునుడు పాత్ర పిక్చర్ ను పెట్టాడు.

vijay-devarakonda-strong-reply-to-trollers-who-trolling-him-for-arjuna-role-kalki-2898-ad-cinema

దీని అర్ధం మీరు ఎన్ని ట్రోల్స్ చేసిన నా పని నేను చేసుకుంటూ పోతనని విజయ్ ఇలా సమాధానం ఇచ్చాడు అంటూ తన అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, కల్కి 2898 AD సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఓ గొప్ప సినిమాగా ముద్ర వేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఓ మ్యాజిక్ ను సీరియట్ చేసారు. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు థియేటర్లు ఫుల్ అయిపోయాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts