Home Cinema Vijay Sethupathi : పుష్ప ఫ్రాంచైజ్ లో విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇచ్చేసాడు..

Vijay Sethupathi : పుష్ప ఫ్రాంచైజ్ లో విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇచ్చేసాడు..

Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ మెకల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన తాజా చిత్రం మహారాజా. అతని 50వ చిత్రం మహారాజా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్‌ వచ్చినందుకు చిత్ర యూనిట్ సక్సెస్‌ మీట్ ను పెట్టారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమా పుష్ప లో నటించాలిసుండే.

అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఇందులో నటించలేదు. కానీ రిపోర్టర్ అదే ప్రశ్న ఆయనను అడిగాడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. సైరా తర్వాత ఉప్పెన మధ్యలో అసలు తెలుగులో సినిమాలు నటించని లేదు. దానికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని విజయ్ సేతుపతిని అడుగుతాడు. నేను చాలా ప్రయత్నించాను కానీ నాకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు అని విజయ్ సేతుపతి సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రిపోర్టర్ పుష్ప సినిమా గురించి మాట్లాడాడు మరియు

vijay-sethupathi-about-his-role-in-pushpa-cinema-in-maharaja-thankyou-meet

ఆ సమయంలో పుష్పలో పాత్రను తిరస్కరించిన మాట నిజమేనా అని అడిగారు. దానికి ఆయన మాట్లాడుతూ, మనం ఎప్పుడు నిజం చెప్పకూడదు, కొన్ని సార్లు బంధం కూడా చెప్పాలి అని చెప్పాడు. ఆ తరువాత నేను ఏ పాత్రను తిరస్కరించలేదు అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప 2: రూల్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Exit mobile version