Leo Movie : సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లియో సినిమా మన ముందుకు రానే వచ్చింది. ఈ సినిమాలో హీరోగా తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించాడు. లియో చిత్రానికి దర్శకత్వం వహించాడు సెన్సషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు. ఈయన కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన సినిమా లు అన్ని మంచి విజయం సాధించాయి. లోకేష్(Leo Movie Leaked) తీసిన సినిమాలు ఇవే.. నటుడు కార్తీకి నటించిన ఖైదీ, విజయ్ తో మాస్టర్ మరియు
కమల హాసన్ తో విక్రమ్ సినిమాలు తీసి దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టాయి. ఈయన తమిళ దర్శకుడు అయినా తెలుగు లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను పొందగలిగాడు. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సినిమాటిక్ యూనివర్స్ లేనే లేదు. కానీ లోకేష్ కంగరాజు తన సొంత సినిమాటిక్ యూనివర్స్ ను మనకు పరిచయం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈయన ఐడియా కు చేతులెత్తి దండం పెట్టాలిసిందే.
ఇలాంటి యంగ్ టాలేంట్స్ ఇండస్ట్రీ కి రావడం వాళ్ళ ఇలాంటివెన్నో మనం తెలుసుకుంటుంటాము. అయితే ఈయన రెండోసారి విజయ్ తో కలిసి సినిమా చేసాడు. లియో సినిమా ఈరోజు మన ముందు కు వచ్చింది. కానీ ఈ సినిమా యూనిట్ కు అనుకోని షాక్ తగిలింది. అదేంటంటే, లియో సినిమా థియేటర్ లో విడుదలై సినిమా హాళ్లు నిండిపోతున్నాయి. ఈ సమయం లో ఈ సినిమా క్లారిటీ ప్రింట్ కొన్ని పైరసీ సైట్లలో రిలీజ్ అయ్యింది. దీనితో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఆ పైరసీ సైట్లపై ఈ చిత్ర నిర్మాణ సమస్త తగిన చర్య తీసుకుంటున్నారు. ఎలా అయినా ఈ సినిమా రిలీజ్ రోజే పైరసీ అవ్వడం చాలా దారుణం. ఈ సినిమా యూనిట్లోనే ఎవరో కావాలనే ఇలా చేశారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కోర్ట్ లో కేసు కూడా రిజిస్టర్ చేసారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ సినిమా క్లారిటీ ప్రింట్ సైట్ల నుండి తొలిగించబడినది.
ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. లియో(Leo Movie Leaked) సినిమాకు అంతటా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మరియు మీరు కూడా ఈ సినిమాను మీ అభిమాన థియేటర్లలో చూసి తరించాలని కోరుకుంటున్నాము.