Home Cinema Vishwak Sen : గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా..?

Vishwak Sen : గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా..?

Vishwak Sen : మాస్ క దాస్ విశ్వక్ సేన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకునాడు. విశ్వక్ సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక జనాల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. పూర్తి మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్సేన్ మాస్ పాత్రలో నటించాడు. నేహాశెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది.

ఆ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన టాక్ వైరల్‌గా మారాయి. కొత్త దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఊ సినిమాలోని డైలాగ్స్ ఇప్పుడు హైలెట్ గా మారాయి. అందరూ డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు. అంతేకాదు ఈ డైలాగులు రాజకీయ నాయకులను పరోక్షంగా తిడుతున్నట్లు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు సినిమా కాన్సెప్ట్ బాగుందని, తొలి భాగం అంతా పుష్ప ఫాస్ట్ ట్రాక్ లా ఉందని అంటున్నారు. సెకండాఫ్ వచ్చేసరికి దర్శకుడు చాలా స్లో టేకింగ్ ఉందంట.

vishwak-sen-latest-cinema-gangs-of-godavari-first-review

అలాగే నేహాశెట్టి, అంజలి పాత్రలు సినిమాకు హైలైట్ గా నిలిచాయని మరో నెటిజన్ తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో విశ్వక్సేన్ వాడిన బోల్డ్ డైలాగ్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా విశ్వక్సేన్ గామి సినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా అంతే విభిన్నంగా కనిపించాడు. కొంతమంది సినిమాను పాజిటివ్‌గా, మరికొందరు నెగటివ్‌గా రేట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.

Exit mobile version