Home Cinema Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ రాజమౌళి ఫోటోలు.. ఇంతకీ దుబాయ్ ఎందుకు వెళ్లినట్లు..

Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ రాజమౌళి ఫోటోలు.. ఇంతకీ దుబాయ్ ఎందుకు వెళ్లినట్లు..

Mahesh Babu : ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ లోనే అందరి హీరోలకన్నా అందగాడు. అమ్మాయిలు మహేష్ అంటే పడి సచ్చిపోతారు దానికి కారణం మిల్క్ బాయ్ లా ఉండే మహేష్ బాబు అందం. మహేష్ బాబు సినిమా హిట్ అయినా ప్లాప్ అయిన కలెక్షన్స్ మాత్రం వచ్చేస్తాయి అది అతడి క్రేజ్. రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా పెద్ద హిట్ అవ్వలేదు అయినా దానికి కలెక్షన్స్ మాత్రం చాలా గెట్టిగా వచ్చాయి.

ప్రస్తుతం మహేష్ బాబు(mahesh babu) రాజమౌళి(rajamouli) తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. మొన్ననే ఈ సినిమాకు సంబందించిన లుక్ టెస్ట్ మహేష్ బాబు పై చేసారు. డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబును 10 కిలోలు తగ్గమని సూచించాడు. మహేష్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు అని తెలుస్తుంది. వీరిద్దరి సినిమా షూటింగ్ అతిత్వరలో తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

mahesh-babu-rajamouli-at-airport

మహేష్ బాబు రాజమౌళి దుబాయ్ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన ఫొటోల్లో మహేష్ రాజమౌళి కలిసి కనిపించారు. మహేష్ బాబు కొత్తగా జుట్టు పెంచేసాడు, ఈ కొత్త హెయిర్ స్టైల్ చూసి అభిమానులు ఆ ఫోటోలని తెగ ట్రెండ్ చేస్తున్నాడు. వీరిద్దరూ సినిమా పని మీదే దుబాయ్ వెళ్లారు అని అక్కడ కలిసి సిట్టింగ్ వేసి అన్ని విషయాలు క్లియర్ గా మాట్లాడుకునట్లు తెలుస్తుంది.

Exit mobile version