Saturday, November 23, 2024
HomeCinemaNaga Babu : నిహారిక విడాకుల వళ్ళ నాగబాబుకు ఇన్ని కోట్లు నష్టమా..

Naga Babu : నిహారిక విడాకుల వళ్ళ నాగబాబుకు ఇన్ని కోట్లు నష్టమా..

Naga Babu : మెగా ఫ్యామిలీ కుటుంబం మరియు అభిమానులు మొత్తం కూడా రామ్ చరణ్ కి కూతురు పుట్టింది అనే ఆనందం లో ఉన్నారు. ఈ శుభవార్త విని రెండు వారాలు కూడా గడవక ముందే చేదు వార్త వినాల్సి వచ్చింది. అదేమిటి అంటే నిహారిక కొణిదెల మరియు చైతన్య దంపతులు విడిపోయారు అనే. వీళ్లిద్దరు విడిపోయారు అనే విషయం మనకి చాలా కాలం క్రితమే తెలిసింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు బయటకి రాలేదు. అయితే రీసెంట్ గా నిహారిక విడిపోబోతున్నాము అని అధికారిక ప్రకటన చెయ్యడం తో ఈ న్యూస్ మరోసారి ట్రెండింగ్ టాపిక్ లిస్ట్ లోకి వచ్చింది.

naga-babu

నిహారిక మరియు చైతన్య విడాకుల పత్రం మీద సంతకాలు చేస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఇలా విడాకులు తీసుకోవడం పై సోషల్ మీడియా లో నిహారికపై తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. నిహారిక సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయి, కానీ చైతన్య కి సినీ పరిశ్రమ తో ఎలాంటి సంబంధం లేదు, అదే వీళ్లిద్దరి కాపురం లో చిచ్చు పెట్టింది అని అంటున్నారు. ఎందుకంటే సినీ పరిశ్రమకి చెందిన వాళ్లకు పార్టీలు మరియు పబ్బులు అనేది అలవాటు. నిహారిక మంచి పార్టీ గర్ల్, ప్రతీ వీకెండ్ కి పబ్ కి వెళ్లడం ఆమెకి అలవాటు.

naga-babu-niharika-konidela

అలా ఒకసారి పబ్బుకి వెళ్లడం వల్ల ఆరోజు పోలీస్ రైడింగ్ జరగడం, ఆ పబ్బులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అని ఖరారు కావడం, అదే పబ్బులో నిహారిక కూడా ఉండడం వంటివి అప్పట్లో పెను దుమారం రేపిన వార్త. కానీ నిహారిక ఎలాంటి డ్రగ్స్ కూడా తీసుకోలేదు అని అప్పట్లో అధికారికంగా ప్రకటించారు పోలీసులు. కానీ నిహారిక అత్తమామలు మాత్రం ఇక నుండి పబ్బులకు , పార్టీలకు మరియు ఫ్రెండ్స్ తో కలిసి తిరగడాలు వంటివి బంద్ చెయ్యాలని కఠినమైన ఆంక్షలు పెట్టారు, అప్పటి నుండి నిహారిక కి ఇంట్లో ఫ్రీడమ్ పోయింది.

naga-babu-family

అక్కడి నుండే గొడవలు రావడం కూడా మొదలయ్యాయి, ఇక చేసేది ఏమి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే నాగబాబు(Naga Babu) వీళ్లిద్దరి పెళ్లిని ఎంత ఘనంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే, కట్నకానుకలు దగ్గర నుండి పెళ్లి ఖర్చులు వరకు ఆయనకీ దాదాపుగా 50 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది, ఇప్పుడు అదంతా వేస్ట్ అయ్యినట్టే అని అంటున్నారు. ఈ జంట విడిపోతున్నారు అని 4 నెలలుగా సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన దాన్ని ఎవ్వరు అంత నమ్మలేదు, కానీ ఆఖరికి ఆ వార్తలే నిజమయ్యాయి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts