Monday, May 20, 2024
HomeCinemaSreeleela : నటి శ్రీలీలకు ఆ హీరో అంటే ప్రాణం అంట.. ఒక్కసారైనా అది చేయాలంట..

Sreeleela : నటి శ్రీలీలకు ఆ హీరో అంటే ప్రాణం అంట.. ఒక్కసారైనా అది చేయాలంట..

Sreeleela About Surya : ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగే అరుదైన అదృష్టం అందరికీ దక్కదు. కొంత మంది హీరోయిన్లు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీ లో ఉంటున్నప్పటికీ ఇంకా మీడియం రేంజ్ లోనే ఉండిపోయిన రోజులు ఇవి. అలాంటిది కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసి, ప్రస్తుతం ఉన్న టాప్ లీడింగ్ స్టార్ హీరోల సినిమాలన్నిట్లో అవకాశాలు అందుకొని రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల. ఏ ముహూర్తం లో ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ, ఈమె ఎంట్రీ తో పూజ హెగ్డే, రష్మిక మండన మరియు కృతి శెట్టి లాంటి హీరోయిన్లు అకస్మాత్తుగా కనుమరుగు అయిపోయారు.

sreeleela-actress

ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం మరియు భగవంత్ కేసరి చిత్రాలతో పాటుగా యంగ్ హీరోల సినిమాలన్నీ కలిపి సుమారుగా పది సినిమాలు ఉన్నాయి. ఇంత మంది హీరోలతో కలిసి నటిస్తున్న ఈ హాట్ బ్యూటీ కి ప్రతీ హీరో తనకి ఇష్టం అని చెప్పే అవకాశం ఉంది, ఎందుకంటే అవకాశాల కోసం హీరోయిన్స్ తమకి ఇష్టమైన హీరోల పేర్లు చెప్పరు. కానీ శ్రీలీల మాత్రం తమిళ హీరో సూర్య అంటే తనకి ఇష్టం అని, పచ్చిగా చెప్పాలంటే ఆయనంటే నాకు ప్రాణం అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

sreeleela-about-surya

ఆయనతో ఒక్క సినిమా చేసే ఛాన్స్ దొరికితే అదృష్టం లాగా భావిస్తాను అని కూడా చెప్పింది(Sreeleela About Surya). ఎందుకు సూర్య అంటే అంత ఇష్టం అని అడగగా, సూర్య ఆపదలో ఉండే వారికి సహాయం చెయ్యడం వంటివి నేను చాలా సార్లు గమనించాను, ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నారు, ఎన్నో ఆపరేషన్స్ చేయించి వేలాది మందిని కాపాడారు. అందుకే ఆయన అంటే నాకు అంట పిచ్చి అని చెప్పుకొచ్చింది శ్రీలీల. మన టాలీవుడ్ లో కూడా అలాంటి హీరోలు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు అంటూ కామెంట్ చేసింది.

sreeleela

ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సూర్య గురించి పొగిడితే పొగుడుకో కానీ టాలీవుడ్ హీరోలను తక్కువ చెయ్యకు అంటూ నెటిజెన్స్ శ్రీలీల పై విరుచుకుపడుతున్నారు. చిరంజీవి , బాలకృష్ణ, మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేవారో ఒకసారి తెలుసుకో అంటూ శ్రీలీల ని తిడుతున్నారు. శ్రీలీల ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts