Friday, September 20, 2024
HomeCinemaStar Actress Divorce : భర్తతో విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్..

Star Actress Divorce : భర్తతో విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్..

Star Actress Divorce : టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి వార్తలకంటే కూడా ఎక్కువగా విడాకుల వార్తలే ఎక్కువ అయిపోయాయి. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీ కి పెద్ద షాక్, ఆ తర్వాత అలాంటి వార్తలు వినడం కామన్ అయిపోయింది. ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ కూడా తన భార్య ఐశ్వర్య తో విడాకులు తీసుకోవడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.

actress-divorce

ఇప్పుడు లేటెస్ట్ గా మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల కూడా తన భర్త చైతన్య తో విడాకులు తీసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. నిహారిక మరియు చైతన్య వివాహం టాలీవుడ్ ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ చిరకాలం గుర్తించుకునేలా అంగరంగ వైభోగంగా జరిపించాడు నాగబాబు. నిశ్చయ్ అనే ట్యాగ్ తో ఒక్కసారి సోషల్ మీడియా లో సెర్చ్ చేస్తే వీళ్లిద్దరి పెళ్లి వైభోగం ఎలాంటిదో అర్థం అవుతుంది, అలాంటి జంట విడిపోయారు అనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు ఇదే బాటలోనే మరో ప్రముఖ స్టార్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధం గా ఉందట(Star Actress Divorce).

heroine-divorce

ఇటీవల కాలం లోనే ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట గత కొంత కాలం నుండి దూరంగా ఉంటున్నట్టు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో ఒక ప్రచారం సాగుతుంది. వీళ్లిద్దరు రీసెంట్ గానే పరస్పర అంగీకారం తో విడాకుల పాత్రలపైనా సంతకం కూడా చేశారట. అయితే ఈ విషయం బయటకి రాకుండా ఆ హీరోయిన్ చాలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తునట్టు సమాచారం. ఒక్కసారి అధికారికంగా విడాకులు అయిపోయిన తర్వాత ప్రకటించడమే మంచిది అనే భావన తో ఆమె ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏమిటి అనేది ఇంకా ఎవరికీ క్లారిటీ రాలేదు.

star-actress-divorce

ఈమధ్య కాలం లో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కాజల్ అగర్వాల్, నయనతార మరియు హన్సిక ఇలాంటి హీరోయిన్స్ ఉన్నారు. మరి వీరులంలో ఎవరు అయ్యుంటారబ్బా అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఆరాలు తియ్యడం మొదలు పెట్టారు. అయితే ఎంత దాచి పెట్టాలి అనుకున్న ఈ సోషల్ మీడియా యుగం లో అసాధ్యం , త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరు అనేది బయటపడుతుంది అంటున్నారు ఫ్యాన్స్, చూడాలి మరి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts