Saturday, November 23, 2024
HomeCinemaTollywood Heros: మేనమామ కూతుర్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..

Tollywood Heros: మేనమామ కూతుర్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..

Tollywood Heros Wifes : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. సినిమా ఇండస్ట్రీ ప్రారంభం నుండే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కేవలం సినీ రంగం లో మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా ఇలాంటివి సర్వసాధారణం. ఒకే వాతావరణం లో కలిసి పని చేస్తుండడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. గతం లోనే కాదు, ఇప్పుడు కూడా ఇలాంటివి బాగానే జరుగుతున్నాయి, కియారా అద్వానీ – వరుణ్ ధావన్, నయనతార – సతీష్ విగ్నేష్ , రీసెంట్ గా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇలా చాలానే ఉన్నాయి.

tollywood-heros

సమంత మరియు నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది, విడాకులు తీసుకున్నప్పుడు కూడా అదే రేంజ్ రెస్పాన్స్. కేవలం ప్రేమ పెళ్లిళ్లు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కుదిరించిన పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది హీరోలు అయితే తమ సొంత మరదళ్ళను పెళ్లి చేసుకొని స్థిరపడిన వాళ్ళ గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము (Tollywood Heros Wifes).

ఏఎన్నార్ – అన్నపూర్ణ:

anr-annapurna

అనోన్య దాంపత్యానికి నిదర్శనంగా నిల్చిన ఈ దంపతులిద్దరూ సొంత కుటుంబానికి చెందిన వారే, తన మేనమామ కూతురు అన్నపూర్ణ ని పెళ్లి చేసుకున్నాడు ఏఎన్నార్. ఇండస్ట్రీ లో ఒకపక్క ఏఎన్నార్ బిజీ గా గడుపుతుంటే, ఇంటి బాధ్యతలు మొత్తం తన నెత్తిన వేసుకొని సంసారం ని కొనసాగించింది అన్నపూర్ణ గారు.

ఎన్టీఆర్ – బసవతారకం:

senior-ntr-basavatarakam

ఎన్టీఆర్ కూడా తన మేనమామ కూతురు బసవతారకం ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భర్త మాటే శిరోధార్యం గా వ్యవహరిస్తూ ఆదర్శపత్ని గా నిలిచారు బసవతారకం గారు. అయితే ఆమె చనిపోయిన కొన్నాళ్ళకు ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ని ప్రేమించి పెళ్లాడాడు, ఇది మన అందరికీ తెలిసిందే విషయమే.

కృష్ణ – ఇందిరా దేవి :

krishna-indira-devi

సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే తన మరదలు ఇందిరా దేవి ని పెళ్లాడాడు. ప్రస్తుతం కృష్ణ కి ఉన్న సంతానం మొత్తం ఈమెకి జన్మించిన వారే, అయితే సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత కృష్ణ విజయనిర్మల ని ప్రేమించి పెళ్లాడాడు. రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ, కృష్ణ తన మొదటి భార్య ఇందిరా కి విరాకులు ఇవ్వలేదు. చివరి శ్వాస వరకు కలిసే ఉన్నారు.

కార్తీ – రజని :

karthi-ranjini

కోలీవుడ్ స్టార్ హీరో , సూర్య తమ్ముడు కార్తీ కూడా తన మేనమామ కూతురినే పెళ్లి చేసుకున్నాడు. ప్రముఖ హీరోయిన్ తమన్నా తో ఈయన ప్రేమాయణం నడిపాడు అని గతం లో రూమర్స్ వచ్చినప్పటికి, అవన్నీ ఫేక్ ప్రచారాలు అని ఈ పెళ్లి తో చెప్పకనే చెప్పాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts