Saturday, September 21, 2024
HomeCinemaNTR-Allu Arha: ఎన్టీఆర్ దేవర సినిమాలో అల్లు అర్హ.. ఎలాంటి రోల్ చేస్తుందంటే..

NTR-Allu Arha: ఎన్టీఆర్ దేవర సినిమాలో అల్లు అర్హ.. ఎలాంటి రోల్ చేస్తుందంటే..

NTR-Allu Arha: RRR చిత్రం తో పాన్ వరల్డ్ క్రేజ్ ని దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై అప్పుడే నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొని ప్రస్తుతం 5 వ షెడ్యూల్ ని జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మీద చాలా సన్నివేశాలను షూట్ చేసారు. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పలు షెడ్యూల్స్ లో పాల్గొన్నాడు (Allu Arha Ntr Devara). చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఊర మాస్ సినిమా కావడం తో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.

allu-arha-in-ntr-devara-movie

ఎన్టీఆర్ మాస్ సినిమా అంటే ఫ్యాన్స్ కి అంత పిచ్చి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే ఈమధ్య చేస్తూ మాస్ కి ఎన్టీఆర్ దూరం అవుతున్నాడని ఫ్యాన్స్ నుండి ఒక కంప్లైంట్ ఉంది. ఈ సినిమాతో ఆ కంప్లైంట్ ని తీసేయబోతున్నాడు ఎన్టీఆర్. RRR చిత్రానికి ముందే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది, కానీ అప్పటికి ఈ సినిమా కేవలం ప్రాంతీయ బాషా చిత్రానికి తగ్గట్టుగానే కథని రాసుకున్నాడు కొరటాల శివ. కానీ RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ కి పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ రావడం తో ఈ సినిమాని పాన్ ఇండియన్ సబ్జెక్టు గా మార్చాడు.

allu-arjun-ntr-with-their-kids

దీనికోసం ఆయన సంవత్సరాం సమయం అదనంగా తీసుకున్నాడు. హాలీవుడ్, బాలీవుడ్ నుండి సరికొత్త టెక్నిషియన్స్ ని తీసుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తున్నాయి. అదేమిటంటే ఈ చిత్రం లో జాన్వీ కపూర్ చిన్నప్పవైతి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ని తీసుకోబోతున్నట్టు సమాచారం (Allu Arha Ntr Devara). ఇప్పటికే అల్లు అర్జున్ ని ఈ విషయం పై స్వయంగా ఎన్టీఆర్ ఫోన్ చేసి అడిగాడట. అల్లు అర్జున్ నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసినట్టు సమాచారం.

ntr-allu-arjun

ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఎంతో మంచి సాన్నిహిత్యం గా ఉంటారు,ఇప్పుడు ఈ వార్తా రావడం తో వారి ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇప్పటికే అల్లు అర్హ సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం చిత్రం లో బాలనటిగా నటించగింది. ఇందులో క్యూట్ గా మాట్లాడుతూ చక్కగా అభినయం పండించిన అల్లు అర్హ కి మంచి పేరు వచ్చింది. మరి దేవర చిత్రం తో ఆమె స్టార్ కిడ్ గా ఎదుగుతుందో లేదో చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts