Sunday, October 6, 2024
HomeCinemaSudheer-Rashmi: మల్లి ఒక్కటైన సుధీర్ రష్మీ జంట.. ఇక అరుపులే..

Sudheer-Rashmi: మల్లి ఒక్కటైన సుధీర్ రష్మీ జంట.. ఇక అరుపులే..

Rashmi Sudheer Reunited: తెలుగు బుల్లితెర పై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది సుడిగాలి సుధీర్ మరియు రష్మీ పేర్లు చెప్పొచ్చు. ఈ జంట లాగ పాపులరైన జంట మరొకటి లేదు. వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే ఎవరికైనా వీళ్ళు ప్రేమికులు అనే అనిపిస్తాది. సోషల్ మీడియా లో ఎన్నోసార్లు ఈ జంట ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. కానీ మా మధ్య అలాంటిది ఏమి లేదని అటు సుడిగాలి సుధీర్, ఇటు రష్మీ చెప్తూనే ఉన్నారు. కానీ అది నమ్మశక్యంగా లేదని, వీళ్లిద్దరు కచ్చితంగా లవ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

rashmi-sudheer-renuited

అయితే ఆడియన్స్ ఈ జంటని బుల్లితెర మీద ఈమధ్య బాగా మిస్ అవుతున్నారు. కారణం సుధీర్ సినిమాల్లో బిజీ అవ్వడమే. కానీ రష్మీ మాత్రం ఇంకా ఈటీవీ లో కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ జంట చాలా కాలం తర్వాత మళ్ళీ బుల్లితెర మీద కనిపించారు. ఈటీవీ ఛానల్ 28 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ షో ని నిర్వహించారు. ఈ షోకి సుధీర్ కూడా విచ్చేశాడు. రష్మీ సుధీర్ ని చూడగానే అతని గుండెల మీద వాలిపోతుంది(Rashmi Sudheer Reunited). ఆ తర్వాత కాసేపు వీళ్లిద్దరు ప్రేమగా మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

sudheer-rashmi

చాలా కాలం తర్వాత మళ్ళీ ఇలాంటి షో లో సుధీర్ ని చూసినందుకు ఆయన అభిమానుల్లో ఎంతో అనందం తో ఉన్నారు. సుధీర్ కి సోషల్ మీడియా లో ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక మీడియం రేంజ్ హీరో కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో, సుధీర్ కి ఆ రేంజ్ క్రేజ్ ఉంటుంది. కేవలం ఆ క్రేజ్ తోనే ఆయన రీసెంట్ గా ‘గాలోడు’ అనే చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘గోట్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే సుధీర్ బుల్లితెర కి మిస్ అయితే ఆయన క్రేజ్ బాగా పడిపోయే ప్రమాదం ఉంది.

sudheer

ఈ షో ద్వారా ఆయన ఈటీవీ లో ప్రయాణం కొనసాగిస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు, చూడాలి మరి(Rashmi Sudheer Reunited). ప్రస్తుతం సుధీర్ టీవీ షో లు అన్ని ఆపేసి సినిమా పై తన ద్రుష్టి పెట్టాడు. కొన్ని సినిమాలో కమెడియన్ గా కనిపించిన సుధీర్ మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం హీరోగా ప్రయత్నిస్తున్నాడు, ఇటీవలే రిలీజ్ అయినా సుధీర్ సినిమా కూడా ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. మరి 2-3 అలంటి సినిమాలు కానీ సుధీర్ చేస్తే టాలీవుడ్ లో మంచి హీరోగా స్థిరపడిపోతాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts