Sai Pallavi Boyfriend: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని అందుకున్న హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులర్ అయిన సాయి పల్లవి ఆ తర్వాత మలయాళం సినిమాల్లో అవకాశాలు సంపాదించింది. అలా తోలి సినిమా ప్రేమమ్ తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సాయి పల్లవి, ఆ తర్వాత తెలుగులో ఫిదా అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ కూడా తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ, ఇండస్ట్రీ లో అతి తక్కువ టైం లోనే లేడీ పవర్ స్టార్ అని అనిపించుకుంది. తన అందం, డ్యాన్స్, నటన మరియు వ్యక్తిగత క్యారక్టర్ ఇలా అన్నీ రకాలుగా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం వల్ల లేడీస్ లో ఆమె పవర్ స్టార్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించింది. అయితే సాయి పల్లవి కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు సాయి పల్లవి ఏ హీరోతో కూడా ప్రేమాయణం నడిపినట్టుగా మనం వినలేదు.
కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సాయి పల్లవి నే ఒక వ్యక్తిని తానూ పిచ్చి పిచ్చిగా ప్రేమించాను అని చెప్పుకొచ్చింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్(Sai Pallavi Boyfriend). సాయి పల్లవి చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగిందట. అలా ఆయన మీద ఇష్టం ఒక రేంజ్ లో పెరిగిపోవడం తో పాటుగా ప్రేమ కూడా పెరిగిందట. అలా చిన్నప్పటి నుండి ఒక అభిమానిగా రజినీకాంత్ ని పిచ్చి గా ప్రేమిస్తూ వచ్చిందట. అంతే కాదు తన రూమ్ నిండా ఇప్పటికీ రజినీకాంత్ ఫొటోలే ఉంటాయట, అంత ఇష్టమట సూపర్ స్టార్ అంటే.
మరి ఇప్పటి వరకు రజినీకాంత్ తో కలిసి ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు. అవకాశం వచ్చిన రోజు సాయి పల్లవి ఆనందానికి హద్దులే ఉండవు అని చెప్పొచ్చు. ఇకపోతే సాయి పల్లవి రీసెంట్ సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడంతో, ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తుంది. సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న పెద్ద సినిమా పుష్ప. ఈ సినిమా షూటింగ్ లో తన షెడ్యూల్ మొన్ననే మొదలు అయింది. సాయి పల్లవి ఫాన్స్ ఈ సినిమాలో కూడా తాను యాక్టింగ్ మరియు డాన్స్ కుమ్మేయబోతుంది అంటూ ఫాన్స్ అప్పుడే ట్విట్టర్ లో ట్వీట్లు మొదలు పెట్టేసారు.