Saturday, September 21, 2024
HomeCinemaRajinikanth: ఆ టాలీవుడ్ హీరోతో రజినీకాంత్ మల్టీ స్టార్రర్.. ఆ హీరో ఎవరంటే..

Rajinikanth: ఆ టాలీవుడ్ హీరోతో రజినీకాంత్ మల్టీ స్టార్రర్.. ఆ హీరో ఎవరంటే..

Rajinikanth: ప్రస్తుతం సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీ వసూళ్ల సునామి ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న రజినీకాంత్ ఈ చిత్రం తో మరోసారి టాలీవుడ్, కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కుదిపేసాడు(Rajinikanth Sharwanand Multi Starrer). వారం రోజులు కూడా గడవకముందే ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటేసింది, అలాగే మొదటి వారం లో 425 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది చెప్పుకొచ్చారు ట్రేడ్ పండితులు. అంటే గత ఏడాది విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ని జైలర్ కేవలం మొదటి వారం లోనే దాటేసిందని అంటున్నారు.

Rajinikanth

రజిని కి ఒక మోస్తారు సినిమా పడితేనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, ఇక విక్రమ్ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమాలు పడితే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకు కూడా అందదు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ ‘జై భీం’ దర్శకుడు జ్ఞానవేల్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అయితే ఈ చిత్రం లో ఒక యంగ్ హీరో నటించేందుకు స్కోప్ ఫుల్ గా ఉంది. ఆ పాత్ర కోసం మన టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ని సంప్రదించుకున్నట్టు తెలుస్తుంది.

rajinikanth-nani

తొలుత ఆయన ఇందులో నటించడానికి ఆసక్తి చూపించినా, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ విన్న తర్వాత మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ పాత్ర కోసం శర్వానంద్ ని సంప్రదించినట్టు టాక్ (Rajinikanth Sharwanand Multi Starrer). శర్వానంద్ కూడా ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆయన కాల్ షీట్స్ కూడా ఓకే అయిపోయినట్టు తెలుస్తుంది. శర్వానంద్ కి చాలా కాలం నుండి కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ తగిలిన తర్వాత ఆయనకీ రీసెంట్ గా ‘ఒకే ఒక జీవితం’ చిత్రం రూపం లో పర్వాలేదు అనే రేంజ్ హిట్ పడింది.

Rajinikanth-sharwanand

ఇప్పుడు ఆయన పెద్ద బ్రేక్ దొరకాలంటే కచ్చితంగా రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో నటించాలి, అందుకే అవకాశం రాగానే మరో నిమిషం కూడా ఆలోచించకుండా ఇందులో నటించేందుకు ఓకే చెప్పేశాడట. రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ అయినప్పటినుండి ఇప్పటి వరకు 400 కోట్లు పైనే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ సినిమా చూసి ఎంతో ఆనందించారు ఎందుకంటే, రోబో సినిమా తరువాత తలైవాకి పెద్ద హిట్లు లేవు, జైలర్ సినిమా రజిని ఫాన్స్ కి కన్నుల పండగే అని చెప్పుకోవచ్చు. శర్వానందతో రజిని చేసే సినిమా కూడా అదిరిపోతోంది అంటున్నారు ఫాన్స్. ఈ మల్టీ స్టార్రర్ సినిమాకు ఎన్ని కలెక్షన్ వస్తాయి అంటారు.?

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts