Puri Jagannadh: టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన మాస్ ఇమేజి ఉన్న దర్శకులు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. వీళ్ళ పేరు ని చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అందుకే ఈ డైరెక్టర్స్ కి ఎన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ తగిలిన బ్రాండ్ ఇమేజి చెక్కు చెదరదు. అలాంటి స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్. ఈయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాతే హీరోయిజం కి సరికొత్త నిర్వచనం ఆడియన్స్ కి తెలిసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బద్రి’ చిత్రం చేసి దర్శకుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైనా పూరి జగన్నాథ్, ఆ తర్వాత ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, శివమణి, చిరుత, దేశముదురు ఇలా ఒక్కటా రెండా ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
సినిమా ఫలితం తో సంబంధం లేకుండా అప్పట్లో పూరి జగన్నాథ్ కి స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే అవకాశం దక్కేది. అయితే గత కొంతకాలం నుండి ఆయనకీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ దొరకడం లేదు. ఆయన చివరి చిత్రం లైగర్ తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. దీంతో బాగా అప్పుల పాలయ్యాడు. ప్రస్తుతం రామ్ తో ఆయన ‘ఇస్మార్ట్ శంకర్ 2 ‘ చిత్రం చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే కెరీర్ ప్రారంభం లో పూరి జగన్నాథ్(Puri Jagannadh) టాలెంట్ ని దర్శక నిర్మాతలు కొంతమంది ఎంతలా వాడుకున్నారో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆయన రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు.
ఆ సమయం లో పూరి జగన్నాథ్ లోని టాలెంట్ ని గమనించిన కొంతమంది దర్శక నిర్మాతలు, ఆయనని కథలు మరియు సన్నివేశాలను రాయించుకోవడం లో బాగా ఉపయోగించుకునేవారట. ఆ కథలతో వాళ్ళు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకొని, పూరి జగన్నాథ్ కి మాత్రం కేవలం 50, 100 రూపాయిలు చేతిలో పెట్టేవారట. అలాగే ఎన్నో ఏళ్ళు ఆయన కెరీర్ ని కొనసాగించాడట. రీసెంట్ గా విడుదలైన ‘మహావీరుడు’ సినిమా మీరంతా చూసే ఉంటారు..ఈ సినిమా లో హీరో యానిమేటెడ్ స్టోరీస్ రాస్తూ ఉండేవాడట.
అలా ఆయన ఒక ప్రముఖ మ్యాగజైన్ కి యానిమేటడ్ స్టోరీలు రాసేవాడట, అలా రాసినందుకు గాను పూరి జగన్నాథ్ కి 50 రూపాయిలు ఇచ్చేవారట. ఇదంతా ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం వల్ల తెలిసింది. ఎవరు ఎన్ని చెప్పిన సరే పూరి టైం ఐపోయింది అంటున్నారు ఫాన్స్. లైగర్ సినిమా చుసిన తరువాత పూరి ఇక సినిమాలు చేయటం మానేస్తే మంచిది అని కూడా కొందరు డై హార్డ్ ఫాన్స్ బాధపడ్డారు.
ఒకప్పటి పూరి మల్లి తిరిగివస్తే బాగుండు, కానీ ఎం చేస్తాం ఎవరికైనా టైం కొద్దీ రోజులే ఉంటుంది. ఉన్నపుడే ఫటా ఫట్ చేసేయాలి, తరువాత చేదాం అన్న అవ్వదు. కానీ ఇలాంటి వారికి కంబ్యాక్ కచ్చితంగా ఉంటుంది, కానీ అది ఎపుడు వస్తుందో ఎవరికీ తెలీదు.