Wednesday, November 13, 2024
HomeCinemaPunch Prasad : సర్జరీ తర్వాత పంచ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడిన మాటలు వింటే...

Punch Prasad : సర్జరీ తర్వాత పంచ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు..

Punch Prasad : ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మన టాలీవుడ్ కి పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. సుడిగాలి ,సుధీర్ , హైపర్ ఆది , చమ్మక్ చంద్ర, షకలక శంకర్ ఇలా ఎంతో మంది కమెడియన్స్ నేడు ఇండస్ట్రీ టాప్ స్టార్ కమెడియన్స్(Punch Prasad Emotional) గా ఒక వెలుగు వెలుగుతుండడానికి కారణం జబర్దస్త్. వీళ్ళ రేంజ్ లో కాకపోయినా ఈమధ్య కాలంలో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న కమెడియన్ పంచ్ ప్రసాద్.

punch-prasad-emotional-words

ఈయన వేసే పంచులు అద్బుతంగా ఉంటాయి. ఎదుటి వాడి మీద పంచులు వెయ్యడం, తిరిగి రివర్స్ లో తనపై వాళ్ళ చేత పంచులు వేయించుకోవడం తో ఈయనకి పంచ్ ప్రసాద్ అని పేరు వచ్చింది. ఇతనికి మొదటి నుండి కిడ్నీ సమస్య ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. రెండు కిడ్నీలు కూడా చెడిపోయాయి, తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యాడు, ఇక పంచ్ ప్రసాద్ మనకి దక్కడేమో అని చాలా మందికి అనిపించింది.

punch-prasad

తన భర్త కి కిడ్నీ దానం చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని భార్య చెప్పినప్పటికీ, పంచ్ ప్రసాద్ చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ బాగా ఆలస్యం అయ్యింది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయించాలి లేకపోతే కష్టం అని చెప్పడంతో, పంచ్ ప్రసాద్ కి మొదటి నుండి ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న నూకరాజు మరియు ఇమ్మాన్యుయేల్ తమ వంతు సహాయం చేసి , సోషల్ మీడియా లో కూడా అభిమానులతో సహాయం చెయ్యమని అడిగి చాలా డబ్బులు రాబట్టారు.

punch-prasad-emotional

కానీ అది ఆపరేషన్ కి సరిపోలేదు. పంచ్ ప్రసాద్ పరిస్థితి ని కళ్లారా చూసిన రోజా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేత ఆర్ధిక సహాయం అందించి, పంచ్ ప్రసాద్ సర్జరీ చేయించింది. రీసెంట్ గానే సర్జరీ చేయించుకున్న పంచ్ ప్రసాద్ ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొనేందుకు వచ్చాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో చాలా కాలం తర్వాత కనిపించిన పంచ్ ప్రసాద్, నా తండ్రి విలువ ఆయన బ్రతికి ఉన్నన్ని రోజులు తెలియలేదు మరియు

ఎప్పుడైతే నేను తండ్రిని అయ్యానో, అప్పుడే నాకు తండ్రి విలువ ఏంటో తెలుసొచ్చింది. నా బిడ్డ నాకు కొడుకు కాదు, తండ్రి లెక్క నేను భావిస్తాను , నాకు(Punch Prasad Emotional) ఏమి కష్టం కలిగిన అంత బాగైపోతుంది అంటూ నాలో మనో ధైర్యం నింపుతాడు నా కొడుకు అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts