Sunday, May 19, 2024
HomeCinemaAllu Arjun : అల్లు అర్జున్ ని చూసి పారిపోతున్న స్టార్ హీరోయిన్లు.. సడన్ గా...

Allu Arjun : అల్లు అర్జున్ ని చూసి పారిపోతున్న స్టార్ హీరోయిన్లు.. సడన్ గా ఇలా రివర్స్ అయ్యారేంటి!..

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మన టాలీవుడ్ హీరోలకు ఇన్నేళ్లు ఎవరికీ సాధ్యం కానీ నేషనల్ అవార్డుని కొల్లగొట్టి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఇప్పటికీ ఆయనపై ఈ విషయం లో ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తన తోటి స్టార్ హీరోలతో పాటుగా , హీరోయిన్స్ మరియు రాజకీయ నాయకులూ కూడా అల్లు అర్జున్(Allu Arjun Pushpa 2) గురించి గర్వంగా ఫీల్ అవుతూ పోస్టులు పెడుతున్నారు. ‘పుష్ప’ సినిమా ఆయన జీవితం లో ఎంతో ప్రత్యేకం.

allu-arjun-latest

టాలీవుడ్ నుండి అసలు సిసలు పాన్ ఇండియన్ స్టార్ గా ఆ చిత్రం మలిచింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో డైరెక్టర్ రాజమౌళి తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ గా నిలిచే ఏకైక సెలబ్రిటీ అల్లు అర్జున్ మాత్రమే. ఆ స్థాయి లో ఆయన తన మార్కు ని పాన్ ఇండియన్ మార్కెట్ లో వేసుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ తో కలిసి చిందులు వెయ్యడానికి మన స్టార్ హీరోయిన్స్ ఆసక్తి చూపడం లేదట. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

allu-arjun

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. పుష్ప పార్ట్ 1 లో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా ‘ఊ అంటావా మామ’ అనే రేంజ్ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ మరియు బాలీవుడ్ హీరోయిన్స్ ని గత కొంత కాలం నుండి సంప్రదిస్తూనే ఉన్నారు. కానీ రెమ్యూనరేషన్స్ భారీగా డిమాండ్ చెయ్యడం తో అందుకు సుకుమార్ ఒప్పుకోవడం లేదట. కేవలం కోటి రూపాయిలు మాత్రమే ఇస్తామని మరియు

allu-arjun-future-projects

అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పడం తో ఇప్పుడు ‘పుష్ప : ది రూల్’ ఐటెం సాంగ్ కి హీరోయిన్స్ కరువు ఏర్పడింది. ఇకపోతే రీసెంట్ గానే అల్లు అర్జున్(Allu Arjun Pushpa 2) తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ‘పుష్ప: ది రూల్’ సెట్స్ లో జరిగే కార్యక్రమాలను వీడియో షూట్ చేసి విడుదల చేసాడు.

ఈ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. ఈ ఏడాది లోపు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts