Mahesh Babu : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించి పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా చాలా ఏరియాల్లో భారీగా వసూలు చేసింది. ‘రంగస్థలం’ సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నాడు దర్శకుడు సుకుమార్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది(Mahesh Babu Pushpa). కానీ ఉన్నట్లుండి ప్రాజెక్ట్ చేతులు మారింది. దాంతో మహేష్ బాబు కోసం రాసుకున్న కథను సుకుమార్ అల్లు అర్జున్ తో తీశారని ప్రచారం జరిగింది. నిజానికి ప్రతి సినిమాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడంలో లెక్కల మాస్టారు సుకుమార్ ది అందెవేసిన చేయి.
విభిన్న కథలతో ఆయన సాహసాలు చేస్తుంటారు. తన హీరోను వెండి తెరపై ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారో సుకుమార్ కు బాగా తెలుసు. అందుకే ఒకటే కంటెంట్ ఫాలో అవ్వకుండా డిఫరెంట్ గా తెరపై అభిమానులు ఊహించని విధంగా తన హీరోను చూపిస్తుంటారు. అందుకే సుకుమార్ సినిమా చేసిన హీరోలకు జనాల్లో క్రేజ్ అంతలా పెరిగిపోతుంది. అందుకే ప్రతీ హీరో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాగా అలాంటి సుకుమార్ మహేష్ బాబుని ఏకంగా తెరపై బట్టల్లేకుండా న్యూడ్ గా చూపించడానికి ట్రై చేశారట. ఆ సినిమా మరేదో కాదు పుష్పనే.
పుష్ప సినిమాల్లో మొదటగా అల్లు అర్జున్ ప్లేస్ లో మహేష్ బాబును ఊహించుకునే డైరెక్టర్ కథ రాసుకున్నారట. కానీ అవుట్ అండ్ మాస్ కంటెంట్ స్టోరీ తన బాడీకి సెట్ అవ్వదని మహేష్ బాబు ఈ కథను రిజెక్ట్ చేశాడన్న వార్తలు అప్పట్లో బాగా ప్రచారం అయ్యాయి(Mahesh Babu Pushpa). అయితే ఈ సినిమాలో ఆఖరి సన్నివేశంలో అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా చేసిన ఫహెద్ ఫజిల్ కేవలం అండర్ వేర్ తో ఫైట్ చేసిన సీన్ సినిమాకే హైలెట్ అయింది. వాస్తవానికి ఈ ప్లేస్ లో మహేష్ బాబు ఉండాలి. మహేష్ ని అలా చూపించాలన్న ఆలోచనతోనే దర్శకుడు సుకుమార్ కథను రాసుకున్నాడు.
కథను విన్నప్పుడు నమ్రత మహేశ్ పక్కనే ఉందట. అప్పుడే నమ్రత డైరెక్టర్ సుకుమార్ తో ఆఖరి సన్నివేశం కొంచెం అన్ కన్వీనెంట్ గా అనిపించలేదట. ఇప్పటి వరకు మహష్ బాబును అలా ఇప్పటి వరకు వెండి తెరపై కనిపించలేదు. మరి ఇప్పుడు మహేశ్ అలా కనిపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్న డౌట్ నమ్రత మెదడులో తట్టిందట. అప్పుడే సుకుమార్ కు పరోక్షంగా ఓ కౌంటర్ ఇచ్చిందట. మీరు కథను రాసుకునేటప్పుడు హీరోలను దృష్టిలో ఉంచుకుని కథను రాసుకోండి అని చెప్పిందట. అలాగే ఆ సీన్లో తమ అభిమాన హీరోను ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్న యాంగిల్లో కూడా ఆలోచించాలని సజెస్ట్ చేసిందట.
అయినా సరే మహేష్ బాబు ఈ పాత్రను రిజెక్ట్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యారట. ఇంత మాస్ కంటెంట్ అంటే ఆయనకు అసలు సెట్ కాదని ఆయన ఓపీనియన్. సినిమా విడుదల అయ్యాక చూస్తే ఆర్థమైంది. ఈ పుష్పరాజ్ పాత్రలో స్టైలిష్ స్టార్ బన్నీ తప్పితే మరే హీరో చేయలేరని అనిపించింది.