Thursday, May 9, 2024
HomeCinemaSamantha : సమంత-విజయ్ లిప్ లాక్.. సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్న నెటిజన్లు..

Samantha : సమంత-విజయ్ లిప్ లాక్.. సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్న నెటిజన్లు..

Samantha : టాలీవుడ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత తొలిసారి జంటగా నటించిన రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి హిట్ చిత్రాల డైరెక్టర్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. లైగర్ వంచి అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ(Samantha Vijay Devarakonda), శాకుంతలం వంటి డిజాస్టర్ తర్వాత సమంత నటించిన సినిమా కావడంతో `ఖుషీ` మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

netijens-comments-on-samantha

విడుదలైన తర్వాత అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పాట‌లు, హేష‌మ్ అబ్దులు వాహెబ్ అందించిన సంగీతం ట్రెండింగ్ లో ఉంది. ఖుషి సినిమా విడుదలకు ముందే మ్యూజిక్ కాన్ప‌ర్ట్ పేరుతో నిర్వహించిన వేడుక యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ స‌మంత లైవ్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

samantha-ruth-prabhu

అప్పుడే ఈ సినిమా క‌చ్చితంగా డామ్ షూర్ హిట్ అవుతుందన్న నమ్మకం అందరిలో ఏర్పడింది. అది ప్రస్తుతం నిజం అయింది. భారీ అంచ‌నాల మ‌ధ్యే సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా లెవల్లో సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైంది. సూప‌ర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్పటి వరకు దాదాపు 60కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో విజ‌య్ – స‌మంత‌ల మ‌ధ్య ఓ లిప్ లాక్ సీన్‌తో పాటు కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

vijay-devarakonda

ఆ ఇంటిమేట్ సీన్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకుని అక్కినేని ఫ్యాన్స్ సమంతను నెట్టింట్లో భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఏ చిన్న అవ‌కాశం దొరికినా యాంటీ ఫ్యాన్స్ స‌మంత‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆడుకుంటున్నారు. తాజాగా `ఖుషీ `(Samantha Vijay Devarakonda)లోని లిప్ లాక్ స‌న్నివేశాన్ని చూపిస్తూ సమంత పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి పెళ్లి తర్వాత సమంత ఇంత బోల్డ్ గా మరే సినిమాలో కనిపించలేదు.

కొంతమంది ఇదంతా సీజీ ఎఫెక్ట్ అని.. వాళ్లు నిజంగా నిజంగా చేయలేదంటుంటే.. మరి కొంతమంది మాత్రం సీన్ రియలస్టిక్ గా ఉండడం కోసం నాచురల్ గా ఉండాలని దర్శకుడు శివనిర్వాణ ఇద్దరిని అడిగిమరీ ఒరిజినల్ గానే చేయించారని ప్రచారం జరుగుతుంది . అంతేకాదు తెరపై సమంత – విజయ్ రొమాన్స్ అదిరిపోయిందంటూ వారి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో నిజంగానే విజయ్ – సమంతలు లిప్ లాక్ డైరెక్ట్ గా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts