Sunday, October 6, 2024
HomeCinemaBalakrishna : ఆ కుర్ర హీరోయిన్ పై బాలయ్య బాబు సీరియస్.. ఇక తన పని...

Balakrishna : ఆ కుర్ర హీరోయిన్ పై బాలయ్య బాబు సీరియస్.. ఇక తన పని ఐపోయినట్టే..

Balakrishna : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్స్ వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకెళ్తారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే ఒక మహాప్రసాదం లాగ భావిస్తారు. ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్ధపడుతారు, కానీ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మాత్రం అందుకు పూర్తిగా రివర్స్. ఈమె కెరీర్ ప్రస్తుతం ఎలా సాగుతుందో మన అందరికీ తెలిసిందే(krithi shetty rejected balakrishna). రీసెంట్ గా చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి, దీంతో ఆమెకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈమెని తీసుకుంటూ కచ్చితంగా సినిమా ఫ్లాప్ అవ్వుద్ది అనే బావనలోకి వచ్చేసారు దర్శక నిర్మాతలు.

krithi-shetty

అయితే అలాంటి సమయం లో కూడా ఆమెకి వచ్చిన మరో క్రేజీ ఆఫర్ ని తిరస్కరించింది అట. ఈ వార్త విన్న నెటిజెన్స్ బ్యాడ్ టైం లో కూడా ఇంత బలుపు అవసరమా అని అంటున్నారు, ఇంతకీ అసలు ఏమి జరిగిందో చూద్దాం. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న డైరెక్టర్ బాబీ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రం లో బాలయ్య కి చెల్లెలు పాత్ర ఉంటుందట, కథకి ఆ పాత్ర ఎంతో కీలకం. ఈ పాత్రని తొలుత కృతి శెట్టి తో చేయిద్దాం అని అనుకున్నాడట డైరెక్టర్ బాబీ.

balakirshna

ఇదే విషయం కోసం ఆమెని సంప్రదిస్తే, ఇలాంటి పాత్రలు నేను చెయ్యను అంటూ మొహం మీదనే చెప్పి పంపేసిందట(krithi shetty rejected balakrishna). హీరో బాలయ్య అని చెప్పినా కూడా పట్టించుకోలేదట. అంతే కాదు ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి తో చేస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రం లో బాలయ్య కూతురి పాత్ర కోసం ముందుగా కృతి శెట్టి ని అడిగారట. అప్పుడు కూడా ఇలాంటి పాత్ర చెయ్యను అని రిజెక్ట్ చేసిందట. ఇప్పుడు ఆ పాత్రని శ్రీలీల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక రేంజ్ డిమాండ్ ఉన్న హీరోయిన్, అలాంటి హీరోయిన్ కూడా ఇలాంటి పాత్రలు చెయ్యడానికి సిద్దపడింది కానీ, కృతి శెట్టి మాత్రం చాలా పొగరు చూపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

actress-krithi-shetty

బాల కృష్ణ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఒకటి భగవత్ కేసరి, మరొకటి NBK 109. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవ్వటం విశేషం. నందమూరి ఫాన్స్ కి వచ్చే రెండు నెలలు పండగ అనే చెప్పాలి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న భగవత్ కేసరి సినిమా పై అభిమానులకి చాల బారి అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ రెండు సినిమాలు హిట్ ఐతే మాత్రం ఇంకా బాలయ్య బాబు ని మరియు ఫాన్స్ ని ఎవ్వరు ఆపలేరు. రచ్చ చేసి పడేస్తారు. ఈ సినిమా హిట్ అవ్వాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. మరెన్నో సినిమా ఉపాదాట్లు కోసం మా వెబ్సైటు ని ఫాలో చేయండి..

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts