Sunday, May 12, 2024
HomeCinemaBala Krishna : బాలయ్య చేతిలో ఉన్న ఈ బుడ్డోడు మాస్ హీరో గా ఎదిగాడు.....

Bala Krishna : బాలయ్య చేతిలో ఉన్న ఈ బుడ్డోడు మాస్ హీరో గా ఎదిగాడు.. ఎవరో గుర్తు పట్టారా..?

Bala Krishna : నందమూరి బాలకృష్ణ ఈ పేరు వినిపిస్తే జై బాలయ్య నినాదాలతో అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు. ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ ఏనాడూ కూడా తండ్రి ని అనుసరించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ మరియు హావభావాలతో మాస్ సినిమాలు చేస్తూ మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆరు పదుల వయస్సు దాటినా కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్, ఫైట్స్ , డైలాగ్స్ చెప్తూ ఇప్పటికీ ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు.

bala-krishna

ఇక ‘అఖండ’ చిత్రం నుండి బాలయ్య రేంజ్ మరో లెవెల్ కి చేరుకుంది. సరికొత్త బాలయ్య ని జనాలు చూడడం అనేది ఇక్కడి నుండే మొదలు అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘వీర సింహా రెడ్డి’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే, ఇప్పుడు అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా సోషల్ మీడియా లో బాలయ్య కి సంబంధించిన ఒక పాత ఫోటో ఒకటి లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.

nandamuri-taraka-ratna

ఈ ఫోటో లో బాలయ్య బాబు(Bala Krishna) ఒక చిన్న బిడ్డని ఎత్తుకొని స్టైల్ గా నిలబడి ఉన్నాడు. ఈ ఫొటోలో ఉన్న ఆ బుడ్డోడు ఎవరబ్బా అని అందరూ అనుకుంటుండగా, అతగాడు బాలయ్య అన్నకొడుకు నందమూరి తారకరత్న అని తేలింది. చిన్నప్పటి నుండి బాలయ్య తారక రత్న ని తన బిడ్డ మోక్షజ్ఞ తో సమానంగా ప్రేమించేవాడు. అతనితో ఎంతో ఆప్యాయంగా మెలిగేవాడు. అయితే రీసెంట్ గానే తారకరత్న గుండె పోటు వచ్చి చనిపోవడం బాలయ్య బాబు మనసుని కలిచివేసింది. ఈ వార్త నుండి బయటకు రావడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది.

bala-krishna

బాలయ్య ప్రోత్సాహం తోనే తారకరత్న సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన మొదటి చిత్రం ప్రారంభం జరిగిన రోజే 9 కి పైగా సినిమాల్లో నటించడానికి సంతకాలు చేసాడు. అలా ఒక్క రోజు లో 9 సినిమాలకు సంతకం చేసిన ఏకైక ఇండియన్ హీరోగా తారకరత్న చరిత్ర సృష్టించాడు. కానీ అతనికి అదృష్టం మరియు ప్లానింగ్ సరిగా కలిసి రాక హీరో గా చేసిన ప్రతీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఫలితంగా హీరోగా సక్సెస్ చూడకుండానే ఈ లోకం ని వదిలి తిరిగిరాని లోకాలకు పయనం అయ్యాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts