Friday, September 20, 2024
HomeCinemaRajamouli : మహేష్ - రాజమౌళి సినిమా ఆగిపోయిందా..? అభిమానులకు గుండెలు ఆగిపోయ్యే వార్త..

Rajamouli : మహేష్ – రాజమౌళి సినిమా ఆగిపోయిందా..? అభిమానులకు గుండెలు ఆగిపోయ్యే వార్త..

Rajamouli : కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఏకైక ఇండియన్ రాజమౌళి. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన నేడు పాన్ వరల్డ్ రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించి ఆస్కార్ అవార్డుని గెలుచుకునే రేంజ్ కి ఎదిగాడు(Rajamouli Mahesh Movie Stopped). అందుకే ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో సినిమా అంటే ప్రతీ సూపర్ స్టార్ కి ఒక కల. #RRR తర్వాత ఆయన ఎవరితో సినిమా చెయ్యబోతున్నాడు అని పెద్ద ఎత్తున చర్చలు జరగగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్నాను అంటూ ఒక ప్రకటన విడుదల చేసాడు. ఈ ప్రకటన మహేష్ బాబు అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసింది.

mahesh-babu

ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పదేళ్ల క్రితమే ఖరారు అయ్యింది. కానీ ఎవరి కమిట్మెంట్స్ లో వాళ్ళు బిజీ గా ఉండడం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ ఏడాది లోపు స్క్రిప్ట్ మొత్తమ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభం నుండి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు అని ఇన్ని రోజులు వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త అభిమానులను కలవర పెడుతుంది. ఎందుకంటే రాజమౌళి త్వరలోనే ఒక్క చిన్న సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు అట.

ss-rajamouli

కేవలం ఆరు నెలలలోపు ఈ సినిమాని పూర్తి చేస్తాడట. ఇప్పటి వరకు రాజమౌళి అన్నీ యాక్షన్ జానర్, పీరియడ్ సినిమాలే చేసాడు కానీ లవ్ & రొమాంటిక్ జానర్ లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు, అందుకే ఆయన ఒక కుర్ర హీరోతో ఆ జానర్ లో చిత్రం తెరకెక్కించబోతున్నాడు అట. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. ఈ సినిమా పూర్తి అయ్యేవరకు రాజమౌళి ఖాళీ గా ఉండాలి, అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది(Rajamouli Mahesh Movie Stopped). మరోపక్క మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని చాలా నిరాశకి గురయ్యారు.

rajamouli-mahesh-babu-movie-stopped

మా హీరో తో సినిమా ప్రకటించి వేరే హీరో సినిమా ఎలా చేస్తావు అంటూ సోషల్ మీడియా లో రాజమౌళి ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రాజమౌళి నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ఒక వారం క్రితం ఒక న్యూస్ వైరల్ అయింది రాజమౌళి కి ఒక జోతిస్యుడు చెప్పిన దాని ప్రకారం తను మహేష్ బాబు తో సినిమా చేస్తే అది ప్లాప్ అవుతుంది అని ప్రస్తుతం జక్కన టైం బాలేదు అని కొన్ని రోజులు ఆగమని చెప్పాడంట.

ఇప్పుడు ఫాన్స్ సినిమా ఆగటానికి కారణం అదే అని అంటున్నారు. రాజమౌళి మాత్రం కుటుంబంతో కలిసి ట్రిప్ మీద ట్రిప్ తెగ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ జోతిస్యుడు చెప్పినట్టే కొన్ని రోజులు ఆగి సినిమా చేదాం అనుకుంటున్నాడు ఏమో జక్కన్న.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts