Monday, May 20, 2024
HomeCinemaRajamouli : మహేష్ బాబు తో సినిమా ను క్యాన్సిల్ చేసుకుంటున్న రాజమౌళి.. కారణం అదేనా..

Rajamouli : మహేష్ బాబు తో సినిమా ను క్యాన్సిల్ చేసుకుంటున్న రాజమౌళి.. కారణం అదేనా..

Rajamouli : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రాజమౌళి ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇండియా లో ఉన్న ప్రతీ డైరెక్టర్ కి ఇప్పుడు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యడం అనేది ఒక కల లాగ మారిపోయింది. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈయన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్ గా మారి నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు(Rajamouli Mahesh Babu Movie). ఆయన దర్శకత్వం వహించిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇలా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ మరొకరు లేదు.

rajamouli-multi-starrer

ఇప్పుడు రాజమౌళి #RRR సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. ఇక నుండి ఆయన సినిమాలు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతాయి. ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న రాజమౌళి , మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో పదేళ్ల క్రితమే ఫిక్స్ అయ్యింది. అయితే రాజమౌళి కి ఉన్న కొన్ని కమిట్మెంట్స్, అలాగే మహేష్ బాబు కి ఉన్న కమిట్మెంట్స్ రెండిటికి క్లాష్ రావడం వల్ల ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది ఈ చిత్రం. కానీ ఇప్పుడు ఈ సినిమా మొత్తానికి సెట్స్ మీదకి వెళ్లబోతుంది.

rajamouli-mahesh

అయితే ఈ చిత్రం ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఒక జ్యోతిష్యుడు అని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ ప్రకటించిన కొత్తల్లోనే ఈ చిత్రం కార్య రూపం దాల్చడానికి చాలా ఆలస్యం అవుతుంది అని ఆయన అన్నాడు(Rajamouli Mahesh Babu Movie). రాజమౌళి ఇలాంటివి పెద్దగా పట్టించుకోడు కానీ, అతను చెప్పిన విధంగానే ఈ చిత్రం కార్యరూపం దాల్చడానికి పదేళ్లకు పైనే సమయం పట్టింది. అయితే ఇంత ఆలస్యం అవ్వడం మహేష్ బాబు కి చాల ప్లస్ అయ్యింది అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ కాదు,పాన్ వరల్డ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు.

mahesh-babu

సరైన సమయం లో సినిమా పడింది, ఇక ఈ కాంబినేషన్ సృష్టించే అద్భుతాలు ఊహకి అందవు అని అంటున్నారు. ఈ ఏడాది లోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనితో సినిమా నిజంగానే ఆగిపోబోతుంది ఏమో అని ఫాన్స్ తెగ బాధ పడిపోతున్నారు.

రాజమౌళి ఐతే rrr సక్సెస్ తరువాత ఫామిలీ తో కలిసి వరల్డ్ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వరల్డ్ టూర్ అయ్యాక వచ్చి మళ్ళీ సినిమాలు చేస్తాడు అని సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్. ఏదిఏమయిన జక్కన్న మాత్రం మన తెలుగు సినిమా ని ప్రపంచ పటంలో పెట్టేసాడు అనే చెప్పాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts