Sunday, October 6, 2024
HomeCinemaRajamouli : నిర్మాతగా ఆ స్టార్ హీరోతో ఇండియన్ సినిమా బయోపిక్ ని తెరకెక్కించబోతున్న రాజమౌళి..

Rajamouli : నిర్మాతగా ఆ స్టార్ హీరోతో ఇండియన్ సినిమా బయోపిక్ ని తెరకెక్కించబోతున్న రాజమౌళి..

Rajamouli : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ప్రస్తుతం రాజమౌళి అనేది బిగ్గెస్ట్ బ్రాండ్. సూపర్ స్టార్స్ ని మించిన స్థాయి అది. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన నేడు బాహుబలి(Rajamouli Producer), #RRR వంటి సంచలనాత్మక సినిమాలు తీసి ఇంటర్నేషనల్ లెవెల్ కి మన తెలుగు సినిమాని తీసుకెళ్లాడు. ఇప్పుడు ఇండియా లో ఉన్న ప్రతీ నటుడిగా ఈ దిగ్గజ దర్శకుడితో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని కోరుకుంటుంటారు.

rajamouli-producer

తన దర్శకత్వం ప్రతిభతో, తన విజన్ తో ఏకంగా ఆస్కార్ అవార్డు ని సొంతం చేసుకున్న రాజమౌళి అతి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో కానీ, లేదా వచ్చే ఏడాదిలో కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటే, రాజమౌళి నిన్న ఎవ్వరూ ఊహించని ప్రకటన చేసి సోషల్ మీడియా ని షేక్ చేసాడు.

rajamouli-turned-as-producer

అదేమిటంటే త్వరలోనే ఆయన నిర్మాతగా ఒక సినిమా తియ్యబోతున్నాడని, అది మన ఇండియా లో మొట్టమొదటి సినిమాని తెరకెక్కించిన దాదా సాహెబ్ పాల్కే జీవిత చరిత్ర మీద ఉండబోతుందని, ఆ సినిమా పేరు ‘మేడ్ ఇన్ ఇండియా’ అని నిన్న ఒక్క అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రానికి దర్శకుడిగా నితిన్ కక్కర్ వ్యవహరిస్తున్నాడని. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న స్టార్ ఇందులో హీరోగా నటిస్తాడని చెప్పుకొచ్చాడు.

rajamouli-turned-as-producer-and-producing-indian-cinema-biopic

మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియన్ స్టార్స్ అంటే రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు ప్రభాస్. ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఈ సినిమాలో నటించబోతున్నారని పరోక్షంగా ఒక హింట్ ఇచ్చేసాడు. ఇప్పటి వరకు మనం ఎన్నో బియోపిక్స్ చూసాము, కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఇండియన్ సినిమా బయోపిక్ ని చూడబోతున్నాము అంటూ రాజమౌళి నిన్న ఒక వీడియో ని విడుదల చేసాడు. ఈ చిత్రానికి ఆయన కొడుకు కార్తికేయ కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరికొన్ని వివరాలు బయటకి రానున్నాయి. దర్శకుడిగా(Rajamouli Producer) ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని రాజమౌళి, నిర్మాతగా కూడా అదే రేంజ్ ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.

కేవలం నిర్మాతగా మాత్రమే కాదు, ప్రభాస్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కల్కి లో రాజమౌళి ఒక క్యారక్టర్ కూడా చేస్తున్నాడు. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts