Sunday, May 19, 2024
HomeCinemaRajamouli-NTR: రాజమౌళి ఎన్టీఆర్ కాంబో లో రాబోతున్న మరో సినిమా.. ఫాన్స్ కి పండగే..

Rajamouli-NTR: రాజమౌళి ఎన్టీఆర్ కాంబో లో రాబోతున్న మరో సినిమా.. ఫాన్స్ కి పండగే..

Rajamouli-NTR: సౌత్ ఇండియా లో మోస్ట్ డేంజరస్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ కచ్చితంగా ఉంటుంది. వీళ్లిద్దరు ఒకే సమయం లో కెరీర్ ని ప్రారంభించారు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సింహాద్రి అనే చిత్రం వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం(Rajamouli ntr film again). ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి చాలా కాలం వరకు హిట్స్ లేవు.

rajamouli-ntr

అలాంటి సమయం లో తన శరీరాన్ని బాగా తగ్గించుకొని రాజమౌళి తో ‘యమదొంగ’ చిత్రం తీసాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. హీరో గా ఎన్టీఆర్ కెరీర్ కి పునర్జన్మని ఇచ్చింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడానికి #RRR వరకు వేచి చూడాల్సి వచ్చింది. #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అత్యున్నత పురస్కారం గా భావించే ఆస్కార్ అవార్డు ని కూడా దక్కించుకొని మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందేలా చేసింది. అలాంటి ఈ కాంబినేషన్ మరో రిపీట్ కాబోతుంది.

rajamouli-another-film-with-ntr

కానీ రాజమౌళి ఈసారి దర్శకుడిగా కాదు, నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. రీసెంట్ గానే తన కొడుకు కార్తికేయ తో కలిసి ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే బయోపిక్ ని నిర్మించబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మన భారత దేశం లో మొట్టమొదటి సినిమాని తెరకెక్కించిన ‘దాదా సాహెబ్ పాల్కే’ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పాన్ ఇండియన్ స్టార్ హీరో గా నటిస్తాడని ముందుగానే హింట్ ఇచ్చారు. ఆ పాన్ ఇండియన్ స్టార్ మరెవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Rajamouli ntr film again). ప్రస్తుతం ఆయన ‘దేవర’ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ‘వార్ 2’ చెయ్యబోతున్నాడు.

ntr-rajamouli

ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రం లోనే నటించబోతున్నాడని టాక్. తక్కువ రోజుల్లోనే షూటింగ్ ని పూర్తి చేస్తారట. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో ఎన్టీఆర్ 30 దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గ చేస్తుంది. దేవర తనకు మొదటి తెలుగు సినిమా కావటం విశేషం. మొదటి సినిమా కె ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్ముడు.

ఇక రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు అని ప్రకటించాడు. ఈ సినిమా లోని క్యారెక్టర్ కి సెట్ అవ్వటానికి రాజమౌళి మహేష్ బాబు తో జిం చేయిస్తున్నాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts