Saturday, November 23, 2024
HomeCinemaRam Pothineni: ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్న హీరో రామ్.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు..

Ram Pothineni: ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్న హీరో రామ్.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు..

Ram Pothineni Marriage: మీడియం రేంజ్ హీరోలలో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ మరియు ఫుల్ రన్ కలెక్షన్స్ ని రప్పించగలిగే సత్తా ఉన్న హీరోలలో ఒకడు రామ్ పోతినేని. దేవదాసు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్, ఆ సినిమా సక్సెస్ తో ఎవరీ కుర్రాడు ఈ రేంజ్ లో నటించాడు అని జనాల నోట్లో బాగా నానాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి, అలాగే ఫ్లాప్స్ కూడా వచ్చాయి. కానీ హిట్టు ఫ్లాప్ అని తేడా లేకుండా మంచి ఇమేజి ని ఏర్పాటు చేసుకోవడం లో మాత్రం ఫెయిల్ కాలేదు రామ్ పోతినేని. ముఖ్యంగా ఈయనకి ఉన్న లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

hero-ram

అలాంటి రామ్ కి త్వరలో పెళ్లి జరగబోతుంది అనే విషయం తెలిస్తే పాపం ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటో. అవును మీరు వింటున్నది నిజమే, హీరో రామ్ చాలా సంవత్సరాల నుండి ఒక క్రేజీ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారట, త్వరలోనే ఆమెతో పెళ్లి కూడా జరగబోతుంది అట(Ram Pothineni Marriage). ఆ హీరోయిన్ మరెవరో కాదు, యూత్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయే అనుపమ పరమేశ్వరన్. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ‘హలో గురు ప్రేమకోసమే’ మరియు ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి సినిమాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ మీద ఈ జంట ఎంతో క్యూట్ గా అనిపించింది.

ram-pothineni

వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు బలంగా కోరుకున్నారో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరు మాత్రం అతి త్వరలోనే అగ్నిసాక్షిగా ఒకటి అవ్వబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా చెయ్యబోతున్నారు అట. సాధ్యమైనంత తొందరగా నిశ్చితార్థం జరిపి, డిసెంబర్ లో పెళ్లి చెయ్యాలని చూస్తున్నారట ఇంటి పెద్దలు. ప్రస్తుతం రామ్ ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా పూర్తి అవ్వగానే వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకుంటారని తెలుస్తుంది.

hero-ram-pothineni

రీసెంట్ గా రామ్ – బోయపాటి కాంబినేషన్ లో ‘స్కంద’ అనే చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదివరకు కూడా హీరో రామ్ పెళ్లి గురించి చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ అవి ఏవి జరగలేదు. మరి ఈ సారి వచ్చిన వార్తలు అయినా నిజమైతే బాగుండు. రామ్ ప్రస్తుతం తన కొత్త సినిమా స్కందా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లో బాగానే ఆడుతుంది. రామ్ పూరి జగన్నాథ్ తో కలిసి తన రెండో సినిమా డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts