Sunday, October 6, 2024
HomeCinemaTrisha : చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష డబల్ రెమ్యూనరేషన్.. ఇన్ని కోట్ల!!

Trisha : చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష డబల్ రెమ్యూనరేషన్.. ఇన్ని కోట్ల!!

Trisha : మెగాస్టార్ చిరంజీవి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాను బింబిసారా దర్శకుడు మల్లిడి వసిష్ఠ తెరక్కేక్కిస్తున్నాడు మరియు యూవీ క్రియేషన్స్ బన్నెర్స్ నిర్మిస్తున్నారు. చిరు సరసన త్రిష జోడిగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది క్రితమే మొదలైంది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ సగంపైనా అయిపోయింది. విశ్వంభరాలో 18 సంవత్సరాల తరువాత చిరు – త్రిష జంటగా నటిస్తున్నారు. వీరు మొదటిసారి కలిసి చేసిన సినిమా స్టాలిన్.

trisha-double-remuneration-for-vishwambhara-cinema-starring-chiranjeevi

ఈ సినిమా 2006 లో విడుదలైంది. త్రిష మరియు చిరు నటించిన ఈ చిత్రం బారి విజయం సాధించింది. ప్రస్తుతుకం వీరు నటించే ఈ స్పెషల్ ప్రాజెక్ట్ సుమారు 200 కోట్లు పైన ఖర్చుపెట్టి తీస్తున్నారని సమాచారం. సోసియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభర సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అని ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు.

trisha-chiranjeevi

ప్రస్తుతం ఈ సినిమాలో త్రిష కూడా ద్విపాత్రలలో కనిపించబోతుంది అని ఓ వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అయితే ఒక్క సినిమాకు 3 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునే త్రిష, ఈ సినిమాలో డ్యూయల్ రోల్ కోసం ఏకంగా 6 కోట్లు తీసుకుంటుందంట. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో చిరంజీకి చెల్లెళ్లుగా ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, సురభి, మృణాల్ ఠాకూర్ మరియు మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా 2025 సంక్రాతికి విడుదల చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts