బాహుబలి సినిమా డైరెక్టర్ రాజమౌళి కి ఎంత పేరు తెచ్చిపెట్టిందో తెలిసిందే. బాహుబలికి ముందు రాజమౌళి అంటే కేవలం టాలీవుడ్ కి మాత్రమే తెలుసు కానీ బాహుబలి తరువాత దేశం మొత్తం అయన పేరు మారుమోగిపోయింది. ప్రతి పెద్ద హీరో రాజమౌళి తో ఒక సినిమా అయినా చేయాలి అని వెయిట్ చేసేలా చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి పేరు ఇండియా నుంచి కాస్త గ్లోబల్ స్థాయికి ఎల్లిపోయింది. డబ్బుతో పాటు అదిరిపోయే పేరు సంపాదించుకున్నాడు మన జక్కన్న. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి 1000 కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫాన్స్ క్రియేటివిటీ బాగా పెరిగింది అనే చెప్పాలి. బాహుబలి సినిమాలో రానా ఒక ఎద్దుతో ఫైట్ చేసే సీన్ ఉంటుంది, ఆ సీన్ కోసం రాజమౌళి చాలా డబ్బు ఖర్చుపెట్టాడు. కానీ ఒక ముసలాయన 90 ఏసీ అదే సీన్ సేమ్ టూ సేమ్ చేసాడు. ఇక ఆ వీడియో వైరల్ అవ్వటంతో అభిమానులు రాజమౌళిని ట్విట్టర్ లో పోస్ట్ కి టాగ్ చేస్తూ మీరు 250 కోట్లు ఖర్చుచేశారు కానీ ఈ ముసలాయన 90ఏసీ చేసేసాడు అంటూ ఫన్నీగా రాజమౌళిని టాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ట్విట్టర్ లో ట్రెండ్ లో ఉంది.
రాజమౌళి @ssrajamouli గారు మీరు డూప్ చెయ్యడానికి @250 కోట్లు ఖర్చు చేసినారు.
ఇక్కడ చూడండి @90 రూపాయలతో ఒరిజనల్ చేసినాడు🤩😜🐂🐂🏃🏃🍺🍻🥂💪💪 pic.twitter.com/Da2G96YqVL
— Srinivas Goud Vuyyala (@SrinivasVuyyal2) March 24, 2024