Home Cinema హాస్పిటల్ లో చేరిన స్టార్ నటుడు సాయాజీ షిండే.. పరిస్థితి విషమం..

హాస్పిటల్ లో చేరిన స్టార్ నటుడు సాయాజీ షిండే.. పరిస్థితి విషమం..

actor-sayani-shinde-hospitalised-with-heart-problem-situation-critical

నటుడు సాయాజీ షిండే ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం. చాల మందికి ఈయన పేరు తెలీదు కానీ చూస్తే మాత్రం యిట్టె గుర్తుపడతారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. నటుడు సాయాజీ షిండే కి తీవ్రమైన గుండె నొప్పి రావటంతో ఆయనని కుటుంబ సభ్యులు గురువారం రోజు హాస్పిటల్ లో చేర్చారు. వెంటనే ఆంజియోగ్రామ్ మరికొన్ని టెస్టులు చేసిన వ్యాద్యులు గుండె నరాలలో సమస్య ఉన్నట్టు గుర్తించారు.

చికిత్స అందిస్తున్న వ్యాధులు మీడియా తో మాట్లాడుతూ ఆయన గుండె రక్తం సరఫరా చేసి నరాలు బ్లాక్ అయ్యాయి అని, ఏంజియోగ్రామ్ చేసాము సర్జరీ చేయాల్సి ఉంటుంది అని తెలిపాము. దానికి ఆయన అంగీకరించడంతో సర్జరీ చేస్తున్నాము. పెద్ద బయపడాల్సిందే ఏమి లేదు అతి త్వరలో సర్జరీ పూర్తి అవుతుంది అని తెలియచేసారు. ఇది విన్న తరువాత కుటుంబ సభ్యులు కొంత ఊరట చెందారు.