Sunday, October 6, 2024
HomeCinemaలోకేష్ కానగరాజ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఆ స్టార్ హీరో ఫాన్స్ కు పండగే..

లోకేష్ కానగరాజ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఆ స్టార్ హీరో ఫాన్స్ కు పండగే..

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ డైరెక్టర్స్ తమ మొదటి సినిమాతోనే బారి విజయం సాధించి తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉంటారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈయన సినిమా ఇండస్ట్రీకి మానగరం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. లోకేష్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఈయన తీసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

లోకేష్ స్టార్ హీరోలతో బ్లాక్బస్టర్ సినిమాలు చేసారు. ఇటీవల ఈయన డైరెక్ట్ చేసిన లియో సినిమా మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ నటించారు. లియో సినిమా లోకేష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్ సినిమాగా నిలిచింది. భారతదేశంలో ఎప్పుడు లేని సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ను పరిచయం చేసారు లోకేష్. ఈయన తీసిన అన్ని సినిమాలకు ఒకదానికి ఒకటి కనెక్షన్ పెట్టి పిచ్చ హైప్ ను క్రియేట్ చేసారు.

lokesh-kanagaraj-next-movie-update

అయితే ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా గురించి ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. లోకేష్ తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ రజినికాంత్ తో తీస్తున్నారు. ఈ సినిమాకు సంభవించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ను ఈ నెల ఆఖరిలో విడుదల చేస్తారట చిత్ర యూనిట్. రజిని అభిమానులు ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts