Home Cinema Akhil : ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అఖిల్.. అక్కినేని ఇంటికి చిన్న...

Akhil : ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న అఖిల్.. అక్కినేని ఇంటికి చిన్న కోడలు దొరికేసింది..

akhil-akkineni-in-love-with-that-actress-may-marry-her-soon-akkineni-family-got-their-small-daughter-in-law

Akhil Akkineni : అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. చిన్న వయసులోనే సిసింద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అఖిల్. ఇక ‘మనం’ సినిమా క్లైమాక్స్ తో పెద్దవాడు అయ్యాక మొదటి సారి వెండితెరపై కనిపించాడు. ‘అఖిల్’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా అరంగేట్రం చేసాడు అక్కినేని అఖిల్(Akhil Akkineni). ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. దాని తరువాత కూడా కొన్ని సినిమాలు చేసాడు.

హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. అఖిల్ కెరీర్ లో కొద్దిగా మంచిగా అనిపించే సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ పూజ హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బానే హిట్ అయ్యింది కానీ అఖిల్ కు మాత్రం అంత పెద్ద పేరేమి రాలేదు. ఆ తరువాత పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’ చేసాడు అఖిల్. ఈ సినిమా డైరెక్ట్ పెద్ద డిసాస్టర్ గా నిలిచింది. ప్రొడ్యూసర్ తన ఆస్తులు అమ్ముకునేలా చేసింది ఈ సినిమా.

akhil-akkineni

ఇక ఇలా సినిమాలు చేసే సమయంలోనే ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అంట అఖిల్. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అట, అతి త్వరలో పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం అఖిల్ తన స్నేహితులతో చెప్పగా వారు మీడియా కు లీక్ చేసినట్టి సమాచారం. అక్కినేని ఇంటికి చిన్న కోడలు దొరికేసింది అంటూ అక్కినేని అభిమానులు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నారు.