Ram Charan : రామ్ చరణ్ కు RRR సినిమా బారి విజయం తరువాత ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. వీరిద్దరూ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమాలో కలిసి మొదటిసారి నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇదిలా ఉంటె ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్తా చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఇటీవల రామ్ చరణ్ కన్ను ఈ బాలీవుడ్ భామ పైన పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు కారణం ఏంటో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ బాలీవుడ్ భామ మరెవరో కాదు కియారా అద్వానీ. రామ్ చరణ్-కియారా అద్వానీతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఇవ్వమని ఓ డైరెక్టర్ ను ఇబంది పెడుతున్నాడట. రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేశారు. స్క్రిప్ట్ లో సెకండ్ హీరోయిన్ కు స్కోప్ ఉందని బుచ్చిబాబు రామ్‌చరణ్‌కి చెప్పగా, రామ్ చరణ్ సెకండ్ హీరోయిన్‌గా కియారాని పరిగణించాలని సూచించాడట. అయితే ఆల్రెడీ గేమ్ చెంజర్ లో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మీరు, మళ్లీ అదే హీరోయిన్ రిపీట్ చేస్తే ప్రజలు బోరింగ్ ఫీల్ అవుతారు అని బుచ్చి బాబు ఎంత చెప్పిన సరే రామ్ చరణ్ వినడం లేదట. ఆ పాత్ర కోసం కియారాను ఇంతలా ఎందుకు సజెస్ట్ చేస్తుండు అనే విషయంపై ఇంటర్నెట్ లో చేర్చ జరుగుతుంది.