Monday, May 20, 2024
HomeCinemaPrabhas : కల్కి 2898 AD సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Prabhas : కల్కి 2898 AD సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Prabhas : పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కల్కి 2898 AD త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. మే 9న సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించినప్పటికీ జాతీయ ఎన్నికల ప్రచారం కారణంగా వాయిదా పడింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో కల్కి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అధికారిక అంచనాల ప్రకారం ఈ సినిమా ఖరీదు 1000 కోట్ల వరకు ఉంటుంది అని భావిస్తున్నారు ఇండస్ట్రీ లో కొందరు.

ఈ సినిమాకి ప్రభాస్ మరియు ఇతర నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ తో ఏకంగా 20, 30 సినిమాలు తీయవచ్చని నెటిజనులు అంటున్నారు. మనం ఇక్కడ ఇప్పుడు ప్రభాస్ మరియు ఇతర నటీనటుల రెమ్యునరేషన్ గురించి తెలుసుకుందాం. మన ఇండియా ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే 100 నుండి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కల్కి చిత్రానికి గాను 150 నుంచి 200 కోట్ల వరకు బారి రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా కామేమో రోల్ లో కనిపించనున్నాడు.

prabhas-remuneration-for-kalki-2898-ad-cinema-will-blow-your-mind

అయితే తెరపై కనిపించేందుకు కమల్ హాసన్ దాదాపు 20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడు అని తెలుస్తుంది. ఇక మరో బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితా బచ్చన్ 30 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట. అలాగే కథానాయికగా నటిస్తున్న దీపికా పదుకొణె 20 కోట్లు, దిశా పటానీ 5 కోట్లు పారితోషికం అందుకున్నారు. వీరితో పాటు ఈ చిత్రానికి పని చేస్తున్న ఇతర ఆర్టిస్టులతో పాటు దర్శకుడు, సంగీత దర్శకుడు మరియు ఇతర సాంకేతిక నిపుణులు 250 నుండి 300 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఖర్చు అవుతుంది అని సమాచారం.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts