Shraddha Das : నటి శ్రద్ధాదాస్ తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఈ అమ్మడు హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి అనుకున్నంత సక్సెస్ అవలేదు. ఆ తరువాత శ్రద్ధ దాస్ సెకండ్ హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టింది. ఈ అమ్మడు నటించిన ఆర్య 2 సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాందించుకుంది. శ్రద్ధా దాస్ డిక్టేటర్, డార్లింగ్, ఒక మినీ కథ, నాగవల్లి మరియు మరోచరిత్ర వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.
ఈమె కాతాలో అనేక వెబ్ సిరీస్‌లలో కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా శ్రద్ధాదాస్ పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ రూమర్‌పై శ్రద్ధాదాస్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నేను ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటానని పుకార్లు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం అసలు లేదు. ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
అయితే శ్రద్ధ దాస్ ప్రేమిస్తున్న ఆ వ్యక్తి తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరో అంటూ ఆమె తెలిపింది. అయితే ఈ హీరో ఎవరు, అతని పేరు ఇప్పుడు వెల్లడించను కానీ ఈ హీరోతో నా పెళ్లి కూడా త్వరలోనే జరగబోతుంది. ఇండస్ట్రీలో చాలా మంది నాకు ప్రపోజ్ చేసారు కానీ, ఇప్పటి వరకు ఈ హీరో తప్ప ఎవరినీ ఇష్టపడలేదు అంటూ తన ప్రేమ రహస్యాన్ని శ్రద్దాదాస్ బయటపెట్టింది. ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.