Sunday, May 19, 2024
HomeCinemaDevara : దేవర షూటింగ్లో ఘోర ప్రమాదం.. 20 మందిని ఆసుపత్రికి తరలింపు..

Devara : దేవర షూటింగ్లో ఘోర ప్రమాదం.. 20 మందిని ఆసుపత్రికి తరలింపు..

Devara : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవర సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు అని తెలిపారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగిందంటూ ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఇంతకీ దేవర సినిమా సెట్లో ఏమైందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం దేవర చిత్ర యూనిట్ ఆంధ్రలోని ఓ పల్లెటూరిలో షూటింగ్ జరుపుతుంది. అయితే వీరు షూటింగ్ చేస్తున్న సమయంలో సెట్లో 20 మంది జూనియర్ ఆర్టిస్టుల పాలుగోన్నారు. అయితే వీరందరూ షూటింగ్ చేస్తుండగా లొకేషన్లో ఉన్న తేన తట్టకు ఎదో తాకడంతో అక్కడ ఉన్నవారిపై దాడి చేశాయట. దేనితో అక్కడ ఉన్న వారంతా పరుగులు తీసారని తెలుస్తుంది.

accident-occured-in-the-shooting-sets-of-devara-cinema

అలా తొక్కిసలాట జరిగి గాయాల పాలయ్యారట. వీరిని పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటలోకి తరలించారని మనకు సమాచారం. ఈ సంఘటన జరగడంతో షూటింగ్ నిలిపివేశారట. ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ పనిచేస్తున్నాడు. ఈ సినిమా పాటలు మరి కొద్దీ రోజులూ మన ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమా బారి విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts